Bigg Boss 7 Telugu: పవరాస్త్ర గెలిచిన రైతు బిడ్డపై అఖిల్ ప్రశంసలు.. వారికి గూబ గుయ్‌మనేలా ఆన్సర్ ఇచ్చాడంటూ..
మొత్తం 11 మంది కంటెస్టెంట్స్‌లో శివాజీ, ఆట సందీప్, శోభాశెట్టి మాత్రమే పర్మనెంట్ హౌజ్‌మేట్స్ కాగా.. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ లిస్టులో చేరిపోయాడు. నాలుగో పవరాస్త్ర సాధించడంతో పల్లవి ప్రశాంత్ కూడా నాలుగో ఇంటి సభ్యుడయ్యాడు. ఇందుకోసం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులన్నింటిలోనూ ఆధిపత్యం చెలాయించాడు రైతు బిడ్డ. తోటి కంటెస్టెంట్ల దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ పవరాస్త్రను సొంతం చేసుకున్నాడు.
బిగ్‌బాస్ ఏడో సీజన్ హోరాహోరీగా సాగుతుంది. కంటెస్టెంట్స్ గేమ్స్, టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులు కంప్లీట్ చేసేందుకు ఎంత కష్టమైనా పడుతున్నారు. బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న ఈ రియాలిటీ షో నాలుగో వారం వీకెండ్‌కు చేరుకుంది. దీంతో ఈ వారం ఎవరు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత సీజన్లతో పోల్చితే ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్లే హౌజ్‌లోకి అడుగుపెట్టారు. మూడు వారాలు ముగిసే సరికి ముగ్గురు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలా, మూడో వారం సింగర్ దామిని భట్ల హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది మాత్రమే ఉన్నారు. ఇక నాలుగో వారం నామినేషన్స్‌లోనూ ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ప్రియాంక జైన్, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ నామినేషన్ల లిస్టులో ఉన్నారు. కాగా మొత్తం 11 మంది కంటెస్టెంట్స్‌లో శివాజీ, ఆట సందీప్, శోభాశెట్టి మాత్రమే పర్మనెంట్ హౌజ్‌మేట్స్ కాగా.. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ లిస్టులో చేరిపోయాడు. నాలుగో పవరాస్త్ర సాధించడంతో పల్లవి ప్రశాంత్ కూడా నాలుగో ఇంటి సభ్యుడయ్యాడు. ఇందుకోసం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులన్నింటిలోనూ ఆధిపత్యం చెలాయించాడు రైతు బిడ్డ. తోటి కంటెస్టెంట్ల దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ పవరాస్త్రను సొంతం చేసుకున్నాడు. దీని కారణంగా పల్లవి ప్రశాంత్‌కు రెండు వారాల పాటు ఇమ్యూనిటీ లభించనుంది. అలాగే హౌజ్‌లో అతనిని ఎవరూ నామినేట్ చేసే అవకాశం లేదు.
బిగ్‌బాస్ ఏడో సీజన్ ఆరంభం నుంచే తన దైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు పల్లవి ప్రశాంత్. టాస్కులు, గేమ్స్‌లోనూ తోటి కంటెస్టెంట్స్‌తో సై అంట్ సై అంటున్నాడు. సోషల్ మీడియాలోనూ అతని పేరు మార్మోగిపోతోంది. ఓటింగ్‌లోనూ మద్దతు లభిస్తోంది. తాజాగా నాలుగో పవరాస్త్ర సాధించడంతో రైతుబిడ్డకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటుడు అఖిల్ సార్ధక్ రైతు బిడ్డకు కంగ్రాట్స్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా .. ‘ఎంత టార్గెట్ చేసినా చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ హౌజ్‌మేట్ అయ్యాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. తనను కింద లాగాలని చూసిన వారికి తన ఆటతీరుతో గూబ గుయ్‌మనేలా పల్లవి ప్రశాంత్ సమాధానం ఇచ్చాడు. జై జవాన్ జై కిసాన్ ‘ అంటూ రాసుకొచ్చాడు అఖిల్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో తోటి ఇంటి సభ్యులు పల్లవి ప్రశాంత్‌ను దూషించినప్పుడు అఖిల్ అండగా నిలిచాడు. పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్ నిస్తూ మాట్లాడాడు.
గతంలోనూ రైతు బిడ్డకు సపోర్టుగా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.