Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: రైతుబిడ్డనే టార్గెట్.. హద్దుమీరిన మాటలు.. ప్రశాంత్ పై విషం చిమ్ముతున్న రతిక, అమర్ దీప్..

అంతకు ముందు పట్టువదలకు డింభకా అనే టాస్క్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఎవరైతే పవరాస్త్రను ఎక్కువ సేపు పట్టుకుని ఉంటారో వారే విజేత అవుతారని చెప్పారు బిగ్‏బాస్. దీంతో ప్రశాంత్, యావర్, సుబ్బు పవరాస్త్ర సాధించేందుకు పోటీ పడ్డారు. ఈ టాస్క్ కు శివాజీని సంచాలకుడిగా నియమించారు. అయితే ఈ గేమ్ చాలా సమయం గడిచినప్పటికీ ఏ ఒక్కరు పవరాస్త్రను వదలకపోవడంతో బిగ్‏బాస్ టాస్క్ రద్ధు చేశారు. ఆతర్వాత కదలకురా వదలకురా అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో పవరాస్త్ర కింద పడిపోకుండా ఎక్కువ సమయం ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో

Bigg Boss 7 Telugu: రైతుబిడ్డనే టార్గెట్.. హద్దుమీరిన మాటలు.. ప్రశాంత్ పై విషం చిమ్ముతున్న రతిక, అమర్ దీప్..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 30, 2023 | 11:44 AM

బిగ్‏బాస్ సీజన్ 7లో నాలుగో వారంలో పవరాస్త్ర గెలిచి రెండు వారాల ఇమ్యూనిటీతోపాటు ఇంటి సభ్యుడిగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ఈ టాస్కులో యావర్, శుభ శ్రీ, ప్రశాంత్ పోటీ పడగా.. చివరకు రైతు బిడ్డ పవరాస్త్ర సొంతం చేసుకున్నారు. అయితే అంతకు ముందు పట్టువదలకు డింభకా అనే టాస్క్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఎవరైతే పవరాస్త్రను ఎక్కువ సేపు పట్టుకుని ఉంటారో వారే విజేత అవుతారని చెప్పారు బిగ్‏బాస్. దీంతో ప్రశాంత్, యావర్, సుబ్బు పవరాస్త్ర సాధించేందుకు పోటీ పడ్డారు. ఈ టాస్క్ కు శివాజీని సంచాలకుడిగా నియమించారు. అయితే ఈ గేమ్ చాలా సమయం గడిచినప్పటికీ ఏ ఒక్కరు పవరాస్త్రను వదలకపోవడంతో బిగ్‏బాస్ టాస్క్ రద్ధు చేశారు. ఆతర్వాత కదలకురా వదలకురా అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో పవరాస్త్ర కింద పడిపోకుండా ఎక్కువ సమయం ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వారే విజేత అని అన్నారు బిగ్‏బాస్. ఈ టాస్కుకు కూడా శివాజీని సంచాలకుడిగా నియమించారు.

ఈ గేమ్ లో యావర్, సుబ్బు ఓడిపోగా.. చివరకు పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీంతో సీరియల్ బ్యాచ్ షాకయ్యింది. ముఖ్యంగా రతిక, అమర్ దీప్‏లు ముఖాలు మాడిపోయాయి. అమర్ దీప్, రతిక, ప్రియాంక ముగ్గురు ఒకే చోట నిలబడి ఉన్నారు. అయితే ప్రశాంత్ గెలిచినట్లుగా బిగ్‏బాస్ అనౌన్స్ చేయగానే.. ఒక్కసారిగా ముఖాలు మార్చేశారు రతిక, అమర్ దీప్, ప్రియాంక. ఆ తర్వాత చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపినట్లుగా బిహేవ్ చేశారు. అయితే ఈ టాస్క్ కు ముందు పట్టువదలకురా టాస్క్ లో అమర్ దీప్, రతిక ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.

అంతకు ముందు సింగిల్ హ్యాండ్ తో పవరాస్త్రని పట్టుకుని ఉన్న ప్రశాంత్ ను డిస్టర్బ్ చేసేందుకు రంగంలోకి దిగిపోయారు అమర్ దీప్, రతిక. హద్దుమీరి మాటల దాడి చేశారు. నిన్ను అక్కా ఎందుకు అన్నాడు రతికా అంటూ అమర్ దీప్ స్టార్ట్ చేయగా.. అపరిచితుడు.. ఎప్పుడు ఏ రిలేషన్ లో ఉంటాడో తెలియదు. ప్రశాంత్ కు బుర్రలేదు.. మట్టి మాత్రమే ఉంది. అందుకే రిలేషన్ మార్చేశాడు. ఆయనకు సిగ్గులేదు. అతని దగ్గర బొచ్చు తప్ప ఏం లేదు అంటూ ఇష్టానుసారంగా మాట్లాడేసింది. మీ ఇంట్లో ఇలాగే పెంచారా ?.. సిగ్గు లేదా ? ఒళ్లు దగ్గర పెట్టుకో.. ఏ అమ్మాయితో ఇలా ప్రవర్తించకు అంటూ నోటికొచ్చినట్లుగా మాటలు విసిరింది రతిక. కావాలని అమర్ దీప్, రతిక ప్రశాంత్ ను రెచ్చగొట్టి మాటలతో మానసికంగా బాధపెట్టారు. అయితే రతిక, అమర్ దీప్ ఎన్ని మాటలు అన్నా ప్రశాంత్ మౌనంగానే ఉన్నాడు. చివరకు పవరాస్త్ర గెలిచి తిట్టినవారికే షాకిచ్చాడు. అయితే టాస్క్ ఇచ్చిన ప్రతిసారి ప్రశాంత్ ను టార్గెట్ చేస్తున్నారు అమర్ దీప్, రతిక. మొదటి నుంచి అరెయ్.. రేయ్ అంటూ చిన్నచూపు చూస్తు ఎప్పటికప్పుడు రైతుబిడ్డను ఓడించాలనే చూస్తున్నారు అమర్ దీప్. ఇక మొన్నటివరకు ప్రశాంత్ తో పులిహోరా కలుపుతూ అతడిని తన వెంట తిప్పుకున్న రతిక ఇప్పుడు రివర్స్ గేమ్ ఆడుతూ..రైతు బిడ్డను టార్గె్ట్ చేసింది. దీంతో రతిక, అమర్ దీప్ ఆట తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!