AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. ఓటింగ్‌లో ఉల్టా పుల్టా.. ఆ టాప్‌ కంటెస్టెంట్‌ కూడా ఔట్‌

మొదటి వారం కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలా, మూడో వారం సింగర్ దామిని భట్ల ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో 11 మంది కంటెస్టెంట్స్‌ మాత్రమే ఉన్నారు. వీరిలో శివాజీ, ఆట సందీప్‌, శోభా శెట్టి మాత్రమే పర్మనెంట్‌ హౌజ్‌ మేట్స్‌ అయ్యారు. అలాగే నాలుగో పవరాస్త్ర సాధించిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ కూడా నాలుగో ఇంటి సభ్యుడయ్యాడు.

Bigg Boss 7 Telugu: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. ఓటింగ్‌లో ఉల్టా పుల్టా.. ఆ టాప్‌ కంటెస్టెంట్‌ కూడా ఔట్‌
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Sep 30, 2023 | 9:03 AM

Share

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఏడో సీజన్‌ నాలుగో వారం వీకెండ్‌కు చేరుకుంది. సాధారణంగా వీకెండ్‌ అంటే నాగార్జున షో ఉంటుంది. కంటెస్టెంట్లపై సటైర్లు, ఫన్నీ గేమ్స్‌ ఉంటాయి. హౌజ్‌ అంతా జోష్‌ ఉంటుంది. దీంతో పాటు ఎలిమినేషన్‌ రౌండ్‌ కూడా ఉంటుంది. ఏడో సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌ రాగా, ముగ్గురు హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలా, మూడో వారం సింగర్ దామిని భట్ల ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో 11 మంది కంటెస్టెంట్స్‌ మాత్రమే ఉన్నారు. వీరిలో శివాజీ, ఆట సందీప్‌, శోభా శెట్టి మాత్రమే పర్మనెంట్‌ హౌజ్‌ మేట్స్‌ అయ్యారు. అలాగే నాలుగో పవరాస్త్ర సాధించిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ కూడా నాలుగో ఇంటి సభ్యుడయ్యాడు. దీంతో అతనికి రెండు వారాల పాటు ఇమ్యూనిటీ లభించడంతో పాటు అతనిని ఎవరూ నామినేట్‌ చేసే అవకాశం లేదు. ఇక నాలుగో వారం నామినేషన్లలో ప్రియాంక జైన్, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ.. ఇలా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మంగళవారం మొదలైన ఓటింగ్‌ పోల్‌ శుక్రవారంతో ముగిసింది. అయితే సీజన్‌లో నాగార్జున చెప్పినట్లు ఓటింగ్‌లో అంతా ఉల్టా పుల్టా అయ్యింది. బిగ్‌బాస్‌కు కంటెంట్‌ ఇస్తూ టాప్‌ కంటెస్టెంట్‌గా వెలుగొందుతోన్న ఒకరు ఈ వీక్‌లో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోయారు. తను మరెవరో కాదు రతికా రోజ్‌. ఓటింగ్‌లో ఈ బ్యూటీ ఆఖరి స్థానంలో నిలిచింది.

డబుల్ ఎలిమినేషన్

కాగా ఈ ఓటింగ్ పోల్‍లో 26.29 శాతంతో ప్రిన్స్ యావర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 16.86 శాతంతో రెండో స్థానంలో గౌతమ్, 16.51 శాతంతో మూడో స్థానంలో శుభ శ్రీ, 15.92 శాతంతో ప్రియాంక నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక 13.64 శాతం ఓటింగ్‌తో టేస్టీ తేజ, 10.78 శాతంతో రతిక రోజ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. అంటే డేంజర్‌ జోన్‌లో టేస్టీ తేజా, రతిక రోజా ఉన్నారు. తేజ విషయానికొస్తే.. గౌతమ్‌పై ఫిజికల్‌ అటాక్‌ చేయడంతో డేంజర్‌జోన్‌లోకి వెళ్లిపోయాడు. ఇందుకు గాను తేజకు రెడ్‌ కార్డ్ చూపించి బయటకు పంపించే అవకాశముందని టాక్‌ నడుస్తోంది. ఇక రతిక రోజ్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. హౌజ్‌కు కంటెంట్‌ ఇస్తున్నా.. తన విచిత్ర ప్రవర్తనతో అందరికీ చికాకు తెప్పిస్తోంది. ఒక వేళ డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటే వీరిద్దరు హౌజ్‌లో నుంచి బయటకు వెళ్లిపోవచ్చని తెలుస్తోంది. మరి ఈ వీకెండ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..