AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Of Kotha OTT: ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్‌ సల్మాన్‌ కొత్త సినిమా.. ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ ఎక్కడ చూడొచ్చంటే?

ఇదిలా ఉంటే దుల్కర్‌ సల్మాన్‌ నటించిన రీసెంట్‌ మూవీ కింగ్‌ ఆఫ్‌ కొత్త ఓటీటీలోకి వచ్చేసింది. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. షబీర్‌ కల్లరక్కల్, ప్రసన్న, శరణ్‌ శక్తి, చెంబన్‌ వినోద్‌ జోస్, అనికా సురేంద్రన్, నైలా ఉష, శాంతి కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్‌ 'గురు' ఫేమ్ రితికా సింగ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది.

King Of Kotha OTT: ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్‌ సల్మాన్‌ కొత్త సినిమా.. 'కింగ్‌ ఆఫ్‌ కొత్త' ఎక్కడ చూడొచ్చంటే?
King Of Kotha Movie
Basha Shek
|

Updated on: Sep 29, 2023 | 9:22 AM

Share

మలయాళంలో స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్న దుల్కర్‌ సల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్‌, మార్కెట్‌ ఉంది. అందుకే అతను నటించిన సినిమాలన్నీ ఇక్కడ కూడా విడుదలువుతుంటాయి. అంతేకాదు మహానటి, సీతారామం వంటి తెలుగు హిట్‌ సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం తొలిప్రేమ, సార్‌ సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇక దుల్కర్‌ సల్మాన్‌ లేటెస్ట్‌గా నటించిన గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ వెబ్‌ సిరీస్‌ కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిబిబిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్‌ హీరో. ఇదిలా ఉంటే దుల్కర్‌ సల్మాన్‌ నటించిన రీసెంట్‌ మూవీ కింగ్‌ ఆఫ్‌ కొత్త ఓటీటీలోకి వచ్చేసింది. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. షబీర్‌ కల్లరక్కల్, ప్రసన్న, శరణ్‌ శక్తి, చెంబన్‌ వినోద్‌ జోస్, అనికా సురేంద్రన్, నైలా ఉష, శాంతి కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్‌ ‘గురు’ ఫేమ్ రితికా సింగ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఆగస్టు 24న కింగ్‌ ఆఫ్‌ కొత్త సినిమా విడుదలైంది. అయితే అంచనాలు తప్పడంతో యావరేజ్‌ రిజల్ట్‌తో సరిపెట్టుకుంది. అయితే దుల్కర్‌ సల్మాన్‌ మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నటన అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కింగ్‌ ఆఫ్‌ కొత్త ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 29) అర్ధరాత్రి నుంచి ఈ గ్యాంగ్‌ స్టర్‌ యాక్షన్‌ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

కాగా కింగ్‌ ఆఫ్‌ కొత్త మూవీ మొదట సెప్టెంబర్‌ 22న ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. ఆతర్వాత 29 నుంచి దుల్కర్‌ సల్మాన్‌ సినిమాను డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. ఫారెర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై జీస్టూడియోస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ స్వయంగా కింగ్‌ ఆఫ్‌ కొత్త సినిమాను నిర్మించారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో గ్యాంగస్టర్ రాజు అనే పాత్రలో దుల్కర్ సల్మాన్‌ నటించాడు. యాక్షన్‌తో పాటు లవ్‌ స్టోరీ, ఫ్రెండ్‌షిప్‌, ఎమోషనల్‌ డ్రామా.. ఇలా అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మరి థియేటర్లలో కింగ్‌ ఆఫ్‌ కొత్త సినిమాను చూడలేకపోయారా? అయితే ఎంచెక్కా ఓటీటీలోనే చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

కింగ్ ఆఫ్ కొత్త ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us