AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawan: మూవీ లవర్స్‌కు ‘జవాన్‌’ టీమ్‌ బంపరాఫర్‌.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. ఆ మూడు రోజులే..

మీరింకా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమా చూడలేదా? టికెట్ల ధరలు అధికంగా ఉన్నాయని ఆగిపోతున్నారా? అయితే ఈ బంపరాఫర్‌ మీకోసమే. ఒక టికెట్‌ కొంటె మరొక టికెట్‌ ఉచితంగా పొందే ఆఫర్‌ను ప్రకటించింది జవాన్ చిత్రబృందం. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని షరతులు విధించింది

Jawan: మూవీ లవర్స్‌కు 'జవాన్‌' టీమ్‌ బంపరాఫర్‌.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. ఆ మూడు రోజులే..
Jawan Movie
Basha Shek
|

Updated on: Sep 28, 2023 | 3:22 PM

Share

మీరింకా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమా చూడలేదా? టికెట్ల ధరలు అధికంగా ఉన్నాయని ఆగిపోతున్నారా? అయితే ఈ బంపరాఫర్‌ మీకోసమే. ఒక టికెట్‌ కొంటె మరొక టికెట్‌ ఉచితంగా పొందే ఆఫర్‌ను ప్రకటించింది జవాన్ చిత్రబృందం. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని షరతులు విధించింది బుక్‌ మై షో, పేటీఎం మూవీస్‌, పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీ పోలీస్‌ వెబ్‌సైట్లు/ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్నవారు ఈ ఆఫర్‌ పొందవచ్చని జవాన్‌ మేకర్స్‌ తెలిపారు. గురువారం, శుక్రవారం, శనివారం (సెప్టెంబర్‌ 28-30) మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, సినిమా ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని షారుక్ ఖాన్ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. అభిమానుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాడు షారుక్‌. జవాన్‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా తరచూ నెటిజన్లతో ముచ్చటిస్తున్నాడు బాలీవుడ్ బాద్‌షా. ఈ సందర్భంగా నే కొందరు అభిమానులు జవాన్‌ సినిమా టికెట్లపై డిస్కౌంట్‌ అడిగారు. వీటికి స్పందించిన షారుక్‌ ‘మీరు అంతా బాధపడకండి.. అంతా మంచే జరుగుతుంది’ అని బాలీవుడ్ స్టార్‌ హీరో రిప్లై ఇచ్చాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోపే జవాన్‌ టికెట్లపై డిస్కౌంట్‌ను ప్రకటించారు మేకర్స్‌.

తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్‌ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. అలాగే దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై షారుక్‌ ఖాన్‌ సతీమణి గౌరీఖాన్‌ జవాన్‌ సినిమాను నిర్మించారు. అనిరుధ్‌ రవిచందర్‌ బాణీలు అందించారు. సెప్టెంబర్‌ 7న విడుదలైన జవాన్‌ సినిమా ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. షారుక్‌ గత సినిమా పఠాన్‌ కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ఒక్క ఏడాదిలోనే రెండుసార్లు రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల్లో నటించిన ఏకైక భారతీయ నటుడిగా షారుక్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

జవాన్ సక్సెస్ మీట్

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి