AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: నాలుగో పవరాస్త్ర కోసం సిత్ర విచిత్రాలు.. కంటెస్టెంట్స్ రకరకాల వేషాలు..

బిగ్‏బాస్ బ్యాంక్, కాయిన్స్ అంటూ కంటెస్టెంట్లను ఆటాడించగా.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‏లకు గాయాలయ్యాయి. ఇప్పుడు వీరిద్దరు నాలుగో పవరాస్త్ర దక్కించుకోవడానికి అడుగు దూరంలో ఉన్నారు. ఇంతకు ముందు పెట్టిన బ్యాంక్ హూస్ట్ టాస్కులో వీరిద్దరు గెలిచారు. దీంతో వీరిద్దరిని నాలుగో పవరాస్త్ర కోసం పోటీ పడే కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‏బాస్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లతో విచిత్ర వేషాలు వేయించాడు.

Bigg Boss 7 Telugu: నాలుగో పవరాస్త్ర కోసం సిత్ర విచిత్రాలు.. కంటెస్టెంట్స్ రకరకాల వేషాలు..
Bigg Boss 7 Telugu Promo
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2023 | 4:24 PM

Share

బిగ్‏బాస్ నాలుగో పవరాస్త్ర కోసం పోటీపడుతున్నారు కంటెస్టెంట్స్. ప్రతి సీజన్ మాదిరిగా కాకుండా ఈసారి ఉల్టా పుల్టా అంటూ ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులతో కంటెస్టెంట్లను అల్లాడిస్తున్నాడు. ఇప్పటికే బిగ్‏బాస్ బ్యాంక్, కాయిన్స్ అంటూ కంటెస్టెంట్లను ఆటాడించగా.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‏లకు గాయాలయ్యాయి. ఇప్పుడు వీరిద్దరు నాలుగో పవరాస్త్ర దక్కించుకోవడానికి అడుగు దూరంలో ఉన్నారు. ఇంతకు ముందు పెట్టిన బ్యాంక్ హూస్ట్ టాస్కులో వీరిద్దరు గెలిచారు. దీంతో వీరిద్దరిని నాలుగో పవరాస్త్ర కోసం పోటీ పడే కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‏బాస్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లతో విచిత్ర వేషాలు వేయించాడు.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. బిగ్‏బాస్ హౌస్ లో గాలా ఈవెంట్ జరుగుతుంది. ఇందులో కంటెస్టెంట్ వినూతన్నంగా.. చిత్ర విచిత్రంగా రెడీ అయి కనిపించాలి. ఎవరైతే ఫన్నీగా కనిపిస్తారో వారిలో ఒకరిని పవరాస్త్ర సాధించేందుకు మూడో కంటెండర్ గా ప్రకటిస్తామన్నారు బిగ్‏బాస్. ఇంకేముంది కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ఒళ్లంతా కూరగాయలతో టేస్టీ తేజ చిత్రంగా రెడీ కాగా.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ప్లేట్స్, స్పూన్స్, వస్తువులతో విచిత్రంగా తయారయ్యాడు. ఇక బిగ్‏బాస్ దెయ్యంగా ప్రియాంక రెడీ కాగా.. రతిక, అమర్, యావర్ , సుబ్బు ఒక్కొక్క గెటప్ లో కనిపించారు.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇక ఈ గాలా ఈవెంట్ కు సందీప్, శోభా శెట్టి హోస్ట్స్ గా వ్యవహరించారు. అలాగే శివాజీ రిపోర్టర్ అవతారంలో వారిని ఫన్నీగా ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. ఇక ఈ ఈవెంట్ లో తమ వేషాధారణతో ఎంటర్టైన్ చేసిన వారిలో ఒకరిని బిగ్‏బాస్ నాలుగో పవరాస్త్ర కోసం పోటీ పడే కంటెండర్ గా ప్రకటించనున్నారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, యావర్ తోపాటు మరొకరు నాలుగో పవరాస్త్ర కోసం పోటీ పడనున్నారు. మరీ ఈ ముగ్గురికి ఎలాంటి టాస్క్ ఇస్తారో చూడాలి. లేదా వారిలో వారే ఒకరిని ఎన్నుకోవాలని సూచిస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?