AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీలకు రంగం సిద్ధం.. ఏకంగా అంతమంది హౌజ్‌లోకి వెళ్లనున్నారా? లిస్టు ఇదే!

త మూడు వారాల్లో మొత్తం ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్‌ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్‌, రెండో వారంలో షకీలా బయటకు పోయారు. ఇక మూడో వారంలో సింగర్‌ దామిని ఎలిమినేట్‌ కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అంటే హౌజ్‌లో ప్రస్తుతం కేవలం 11 మంది మాత్రమే గేమ్‌ ఆడుతున్నారు

Bigg Boss 7 Telugu: వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీలకు రంగం సిద్ధం.. ఏకంగా అంతమంది హౌజ్‌లోకి వెళ్లనున్నారా? లిస్టు ఇదే!
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Sep 28, 2023 | 5:30 PM

Share

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో రసవత్తరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా అంటూ గత సీజన్ల కంటే కొంచెం భిన్నంగా నడుస్తోన్న ఈ ఫేమస్‌ టీవీ షో నాలుగో వారంలోకి ప్రవేశించింది. కంటెస్టెంట్లకు ఇస్తోన్న గేమ్స్‌, టాస్కులు కూడా డిఫరెంట్‌గానే ఉంటున్నాయి. పైగా హౌజ్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌లో ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే హౌజ్‌మేట్స్‌ అయ్యారు. మిగతా వారు కూడా హౌజ్‌మేట్స్‌గా తమను తాము ప్రూవ్‌ చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం బిగ్‌బాస్‌ పెట్టే టాస్కుల్లో ట్యాలెంట్ చూపించాల్సి ఉంది. కాగా నిజం చెప్పాలంటే గత సీజన్‌లతో పోల్చుకుంటే ఈసారి తక్కువ మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. కేవలం 14 మందిని మాత్రమే ఇంట్లోకి పంపించారు. ఇక గత మూడు వారాల్లో మొత్తం ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్‌ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్‌, రెండో వారంలో షకీలా బయటకు పోయారు. ఇక మూడో వారంలో సింగర్‌ దామిని ఎలిమినేట్‌ కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అంటే హౌజ్‌లో ప్రస్తుతం కేవలం 11 మంది మాత్రమే గేమ్‌ ఆడుతున్నారు.ఇక నాలుగో వారంలోనూ ఒకరు హౌజ్‌ నుంచి బయటకు పోనున్నారు. అదే జరిగితే 10 సభ్యులతో బిగ్‌బాస్‌ గేమ్‌ను రన్ చేయడం కష్టమవుతుంది. అందుకే మరి కొంతమంది సెలబ్రిటీలను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. గత సీజన్ల కంటే ఈసారి భారీగా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు ఉన్నాయని సమాచారం.

ఇవి కూడా చదవండి

ఈసారి మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు వైల్డ్‌ కార్ట్ ఎంట్రీతో బిగ్‌బాస్‌లోకి రానున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐదో వారంలోనే వీరు హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారట. ఇందుకోసం బిగ్‌బాస్‌ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈసారి బిగ్‌బాస్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీల లిస్టులో బాగా వినిపిస్తున్న పేరు ప్రముఖ సీరియల్‌ నటుడు అంబటి అర్జున్‌. మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండంటూ అంబటి పోస్ట్‌ పెట్టడం, దీనికి యాంకర్‌ రవి ఆల్‌ది బెస్ట్‌ చెప్పడంతో అతను బిగ్‌బాస్ ఎంట్రీ ఖరారైందని తెలుస్తోంది. అలాగే మొగలి రేకులు సీరియల్‌ ఫేమ్‌ అంజలి వపన్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ భోలే షావలి, హీరోయిన్‌ ఫర్జానా, సుప్రిత, జబర్దస్త్ ఫేమ్ నరేష్‌, నటి పూజా మూర్తి కూడా వైల్డ్‌ కార్డ్‌తో ఇంటిలోకి రానున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఈటీవీ ప్రభాకర్‌ కూడా హౌజ్‌లోకి అడుగుపెట్టునున్నారని తెలుస్తోంది.

మొగలి రేకులు ఫేమ్ అంజలి పవన్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్