AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: గత సీజన్ల కంటే భారీగా నాగార్జున రెమ్యునరేషన్‌.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎన్ని కోట్లో తెలుసా?

అందుకు తగ్గట్టుగానే షో రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు పోటాపోటీగా టాస్కుల్లో పాల్గొంటున్నారు. ఇక ఎప్పటిలాగే తన హోస్టింగ్‌తో బిగ్‌బాస్‌ షోను ముందుకు తీసుకెళుతున్నాడు అక్కినేని నాగార్జున. 3వ సీజన్‌ నుంచి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత సీజన్ల కంటే.. ఈ సీజన్‌కు నాగార్జున ఎక్కువగా కాస్త ఎక్కువగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: గత సీజన్ల కంటే భారీగా నాగార్జున రెమ్యునరేషన్‌.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎన్ని కోట్లో తెలుసా?
Nagarjuna in Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Sep 27, 2023 | 8:35 PM

Share

ప్రముఖ బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్‌ చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. గత సీజన్‌ అనుభవాల దృష్ట్యా తాజా సీజన్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్‌. కంటెస్టెంట్ల ఎంపిక దగ్గరి నుంచి టాస్కుల వరకు అన్ని విషయాల్లోనూ కాస్త డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే షో రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు పోటాపోటీగా టాస్కుల్లో పాల్గొంటున్నారు. ఇక ఎప్పటిలాగే తన హోస్టింగ్‌తో బిగ్‌బాస్‌ షోను ముందుకు తీసుకెళుతున్నాడు అక్కినేని నాగార్జున. 3వ సీజన్‌ నుంచి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత సీజన్ల కంటే.. ఈ సీజన్‌కు నాగార్జున ఎక్కువగా కాస్త ఎక్కువగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు సుమారుగా కోటి రూపాయలు తీసుకుంటున్నారట నాగ్‌. సాధారణంగా బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌ మూడు నెలలు నడుస్తుంది. అంటే దాదాపు 12 వారాలు. ప్రతి వీకెండ్‌లో నాగార్జున షోకు వస్తుంటారు. అలా శని, ఆదివారాలన్నీ కలిసి సీజన్‌ మొత్తం మీద 20 కోట్ల రూపాయలకు పైగానే పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నాగార్జున రేంజ్‌ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అయితే మొత్తం ముగ్గురు కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్‌, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్‌ దామినీ ఎలిమినేట్‌ అయ్యారు. ఇక నాలుగో వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌ లిస్ట్‌లోకి వచ్చారు. రతికా రోజ్, టేస్టీ తేజా, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ ఈ లిస్టులో ఉన్నారు. అలాగే మరికొంత మంది సెలబ్రిటీలు హౌజ్‌లోకి రానున్నారని తెలుస్తోంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలతో కొందరు బుల్లితెర సెలబ్రిటీలు హౌజ్‌లో రానున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూశారా?

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

బిగ్ బాస్ హౌజ్ లో నాగార్జున..

నా సామి రంగ సినిమాలో నాగార్జున..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..