AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papam Pasivadu: కన్ఫ్యూజన్‌తో కడుపుబ్వా నవ్వించే ‘పాపం పసివాడు’.. ట్రైలర్‌ చూశారా? ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పాపం పసివాడు’ సిరీస్‌లో టాలెంటెడ్ సింగర్ శ్రీరామ చంద్రతో పాటు గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కథ విషయానికొస్తే.. శ్రీరామ చంద్ర పాతికేళ్ల క్రాంతి అనే కుర్రాడి పాత్రలో అలరించబోతున్నారు. అతను నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాడు. అలాంటి తరుణంలో అతన్ని ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తారు.

Papam Pasivadu: కన్ఫ్యూజన్‌తో కడుపుబ్వా నవ్వించే 'పాపం పసివాడు'.. ట్రైలర్‌ చూశారా? ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Papam Pasivadu Web Series
Basha Shek
|

Updated on: Sep 27, 2023 | 2:54 PM

Share

పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’ అనే కామెడీ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను వీకెండ్ షో బ్యానర్‌ రూపొందించింది. ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తే ఈ రొమాంటిక్ కామెడీ ట్రైలర్‌ను దర్శకుడు సందీప్ రాజ్ రిలీజ్ చేశారు. ఈ ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఫన్ రైడర్ సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘పాపం పసివాడు’ సిరీస్‌లో టాలెంటెడ్ సింగర్ శ్రీరామ చంద్రతో పాటు గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కథ విషయానికొస్తే.. శ్రీరామ చంద్ర పాతికేళ్ల క్రాంతి అనే కుర్రాడి పాత్రలో అలరించబోతున్నారు. అతను నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాడు. అలాంటి తరుణంలో అతన్ని ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తారు. మరి కన్ఫ్యూజన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన క్రాంతి లైఫ్‌ ఎలాంటి మలుపులు తీసుకుంది అన్నది చూడాలంటే పాపం పసివాడు వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే అంటున్నారు మేకర్స్‌. కాగా ట్రైలర్‌ లాంఛింగ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ, ‘పాపం పసివాడు ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ కావటం ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రేమ, కామెడీ కాంబోలో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ రోలర్ కోస్టర్‌లా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సిరీస్ ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఎంటైర్ టీమ్‌కి అభినందనలు’ అని పేర్కొన్నారు.

ఇప్పటికే ప్లే బ్యాక్ సింగర్‌గా తన ట్యాలెంట్‌ను ఎప్పుడో చాటుకున్నారు ఇండియన్‌ ఐడల్‌ శ్రీరామచంద్ర. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా ఆహాలో రూపొందిన ‘పాపం పసివాడు’ సిరీస్ గురించి మాట్లాడుతూ, ‘ఆహాతో నేను కలిసి పని చేయటం ఇది మూడోసారి. యాంకర్‌గా ఇక్కడ నా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు పాపం పసివాడు సిరీస్‌తో యాక్టర్‌గా మారాను. ఇది ఓ వైపు ప్రేమ మరో వైపు కామెడీ కలయికతో సాగే ఒరిజినల్. చాలా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేశాను. సెప్టెంబర్ 29న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు. సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో ‘పాపం పసివాడు’ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందమైన ప్రేమ కథతో పాటు ఆకట్టుకునే భావోద్వేగాలు, ఎంటైర్‌టైన్‌మెంట్ ఇందులో ఉంటాయంటున్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

పాపం పసివాడు ట్రైలర్..

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్