AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: హౌజ్‌లో మతపరమైన వ్యాఖ్యలు.. ఓటింగ్‌లోనూ వీక్‌.. ఎలిమినేట్ కానున్న ఆ కంటెస్టెంట్!

ఈ సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెడితే ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. మొదటివారంలో కిరణ్‌ రాథోడ్‌ హౌజ్‌ నుంచి బయటకు పోగా, రెండో వారంలో సీనియర్‌ నటి షకీలా ఎలిమినేట్‌ అయ్యారు. ఇక మూడో వారం కూడా ఎండింగ్‌కు వచ్చింది కాబట్టి ఈ వీక్‌లో ఎవరు బయటకు వెళ్లనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే మూడో వారం కూడా ఒక లేడీ కంటెస్టెంట్‌ హౌజ్‌ను వీడనుందని తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: హౌజ్‌లో మతపరమైన వ్యాఖ్యలు.. ఓటింగ్‌లోనూ వీక్‌.. ఎలిమినేట్ కానున్న ఆ కంటెస్టెంట్!
Bigg Boss Season 7 Telugu
Basha Shek
|

Updated on: Sep 22, 2023 | 8:35 PM

Share

బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. మొదటి రెండు వారాలు కాస్తా చప్పగా సాగిన ఈ గేమ్‌ షో మూడో వారం నుంచి మాత్రం రంజుగా సాగుతోంది. హౌజ్‌మేట్స్ అందరూ చురుగ్గా టాస్కులు, గేమ్స్‌లో పాల్గొంటున్నారు. ఇక మూడో పవర్‌ అస్త్ర కంటెండర్‌ కోసం హౌజ్‌మేట్స్ హోరాహోరీగా తలపడుతున్నారు. కాగా ఈ సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెడితే ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. మొదటివారంలో కిరణ్‌ రాథోడ్‌ హౌజ్‌ నుంచి బయటకు పోగా, రెండో వారంలో సీనియర్‌ నటి షకీలా ఎలిమినేట్‌ అయ్యారు. ఇక మూడో వారం కూడా ఎండింగ్‌కు వచ్చింది కాబట్టి ఈ వీక్‌లో ఎవరు బయటకు వెళ్లనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే మూడో వారం కూడా ఒక లేడీ కంటెస్టెంట్‌ హౌజ్‌ను వీడనుందని తెలుస్తోంది. ఇక మూడో వారంలో ప్రియాంక జైన్, అమర్‌దీప్, శుభశ్రీ, రతిక, దామిని, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్.. ఇలా మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్‌లో ప్రియాంక జైన్‌ లీడింగ్‌లో ఉంది. ప్రస్తుతం హౌజ్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌లో ఆమె కూడా ఒకరు. ఎమోషన్స్‌కు తలొగ్గకుండా ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా గేమ్‌ ఆడుతోంది. అమర్‌ దీప్‌, రతిక, గౌతమ్‌ కృష్ణ, ప్రిన్స్‌లకు కూడా భారీగానే ఓట్లు వచ్చాయని తెలుస్తోంది.

ప్రస్తుతమున్న ఓటింగ్‌ రిజల్ట్స్‌ ప్రకారం.. సింగర్‌ దామిని, నటి శుభశ్రీ ప్రస్తుతం డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. హౌజ్‌ లో అందరికంటే ఎక్కువ నామినేషన్స్‌ కూడా వీరికే పడ్డాయి. ఇక వినాయక చవితి రోజు సింగర్‌ దామిని చేసిన కొన్ని వ్యాఖ్యలు హౌజ్‌లో ఆమె ప్లేస్‌కు చేటు తెచ్చినట్లు తెలుస్తోంది. ‘ఈ రోజు వినాయక చవితికి తను కూడా వచ్చి అక్షింతలు వేశాడు’ అని దామిని సందీప్‌తో చెబుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది ప్రిన్స్‌ యావర్‌ను ఉద్దేశించే దామిని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ నియమ, నిబంధనల ప్రకారం హౌజ్‌లో కుల మతాల ప్రస్థావన అసలు తీసుకురాకూడదు. కాబట్టి ఒకవేళ దామిని నిజంగా ఆ వ్యా్‌ఖ్యలు చేసి ఉంటే మాత్రం ఈ వారం ఆమెనే ఎలిమినేట్‌ కావడం ఖాయమంటున్నారు. ముగ్గురు కంటెస్టెంట్స్‌ వెళ్లిపోవడంతో ఈ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కచ్చితంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

డేంజర్ జోన్ లో సింగర్ దామిని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?