AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Siraj: ‘మిస్‌ యు పప్పా’.. తండ్రిని గుర్తుచేసుకున్న హైదరాబాదీ పేసర్‌.. ఎమోషనల్‌ పోస్ట్‌

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు. తన తల్లిదండ్రులతో కలిసున్న ఫొటోను తన గ్రౌండ్‌లో ఆడుతున్న ఫొటోను జత చేసి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసిన హైదరాబాదీ పేసర్‌ 'మిస్‌ యూ పప్పా' అని క్యాప్షన్‌ ఇచ్చాడు. కాగా కొన్నినెలల క్రితతే సిరాజ్‌ తండ్రి కన్నుమూశారు. ఆసమంయలో అతను ఆస్ట్రేలియా పర్యటనలో ఉండడంతో తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయాడు. దీంతో తరచూ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ అవుతన్నాడీ స్టార్‌ పేసర్‌

Mohammed Siraj: 'మిస్‌ యు పప్పా'.. తండ్రిని గుర్తుచేసుకున్న హైదరాబాదీ పేసర్‌.. ఎమోషనల్‌ పోస్ట్‌
Mohammed Siraj
Basha Shek
|

Updated on: Sep 21, 2023 | 2:12 PM

Share
టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు. తన తల్లిదండ్రులతో కలిసున్న ఫొటోను తన గ్రౌండ్‌లో ఆడుతున్న ఫొటోను జత చేసి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసిన హైదరాబాదీ పేసర్‌ ‘మిస్‌ యూ పప్పా’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. కాగా కొన్నినెలల క్రితతే సిరాజ్‌ తండ్రి కన్నుమూశారు. ఆసమంయలో అతను ఆస్ట్రేలియా పర్యటనలో ఉండడంతో తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయాడు. దీంతో తరచూ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ అవుతన్నాడీ స్టార్‌ పేసర్‌.  ఇక తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మరోసారి సత్తా చాటాడు సిరాజ్. ఆసియా కప్‌కి ముందు ఐసీసీ వన్డే  బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న సిరాజ్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. ఆసియా కప్ ఫైనల్స్‌లో శ్రీలంకపై ఆరు వికెట్లు పడగొట్టి.. అగ్రస్థానానికి చేరుకున్నాడు.  వన్డేలలో ఏడాదిన్నర కాలంగా నిలకడగా రాణిస్తున్న సిరాజ్.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంక,  న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌లు ముగిశాక నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్‌లో ఆడలేదు. మిగతా బౌలర్లు కూడా నిలకడగా రాణించడంతో సిరాజ్.. ర్యాంకింగ్స్‌లో కిందికి వెళ్లిపోయాడు. ఆసియా కప్‌ ఆరంభంలో నైన్త్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ టోర్నీ ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయినా ఫైనల్‌లో శ్రీలంకపై మాత్రం చెలరేగిపోయాడు.
ఆసియా కప్ ఫైనల్‌లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్‌ ఓ మెయిడెన్ ఓవర్ వేసి 21 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో వన్డే ర్యాంకింగ్ అమాంతం పెరిగింది. ఈ ప్రదర్శనతో సిరాజ్.. 694 పాయింట్లతో  నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. నిన్నటిదాకా నెంబర్ వన్ హోదాను అనుభవించిన జోష్ హెజిల్‌‌వుడ్ 678 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్,మిచెల్ స్టార్క్ , మాథ్యూ హెన్రీ, ఆడమ్ జంపా వరుసగా 8 స్థానాలను ఆక్రమించగా  కుల్దీప్ యాదవ్ 9, షహీన్ అఫ్రిది 10వ స్థానాల్లో ఉన్నారు.  టీమిండియా టెస్టుల్లో, టీ20ల్లో నెంబర్‌ వన్‌.. వన్డేల్లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. బ్యాట్స్‌మెన్ జాబితాలో వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. టీ20ల్లో సూర్యకుమార్‌ టాప్‌లో ఉన్నాడు. ఐసీసీ తాజా ర్యాంక్‌లలో భారత్‌ మూడు ఫార్మాట్లలో టీమ్‌గానే కాకుండా వ్యక్తిగతంగా ఆటగాళ్ల ర్యాంకులలో కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
Mohammed Siraj Post

Mohammed Siraj Post

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..