MS Dhoni: గణనాధుని ఉత్సవాల్లో ఎంఎస్ ధోని.. వైరల్ అవుతున్న వీడియో.. ఆనందంలో అభిమానులు..

MS Dhoni: ధోని అభిమానులు మాత్రం పండుగ వేళ తమ అభిమాన క్రికెటర్ జాడ ఎక్కడనేది తెలియక నిరాశ చెందారు. కానీ అలాంటి వారి కోసమే అనుకుంటా.. ధోనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాకి దూరంగా ఉండే ధోని.. ఐపీఎల్ 2023 తర్వాత కంటికి కరువైపోయాడు. అడపాదడపా నెట్టింట వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నా..

MS Dhoni: గణనాధుని ఉత్సవాల్లో ఎంఎస్ ధోని.. వైరల్ అవుతున్న వీడియో.. ఆనందంలో అభిమానులు..
MS Dhoni celebrating Ganesh Chaturthi
Follow us

|

Updated on: Sep 21, 2023 | 2:00 PM

దేశవ్యాప్తంగా వినాయక చవితిని పునస్కరించుకుని గణపతి నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా పండుగ సందర్భంగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆయా క్రికెటర్ల అభిమానులు కూడా ఫుల్ ఖుష్‌ అయ్యారు. అయితే ధోని అభిమానులు మాత్రం పండుగ వేళ తమ అభిమాన క్రికెటర్ జాడ ఎక్కడనేది తెలియక నిరాశ చెందారు. కానీ అలాంటి వారి కోసమే అనుకుంటా.. ధోనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాకి దూరంగా ఉండే ధోని.. ఐపీఎల్ 2023 తర్వాత కంటికి కరువైపోయాడు.

అడపాదడపా నెట్టింట వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నా.. అవి ఎవరో పెట్టినవే కానీ ధోని నుంచి వచ్చినవి కాదు. ఇప్పుడు కూడా ఓ అభిమాని షేర్ చేసిన వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతోన్న వీడియోలో ధోని ముంబైలోని ఓ గణనాధుని విగ్రహంపై పూలు చల్లుతూ కనిపించాడు. ఇలా గణపతి ఉత్సవాల్లో పాల్గొన్న ధోనిని చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. ఇంకా ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు. అలాగే వైరల్ అవుతున్న వీడియోపై అటు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు, లైకులు వర్షం కురిపిస్తున్నారు. ‘వినాయకుడితో నాయకుడు’.., ‘మహీ భాయ్’.. ‘తాలా’ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రాంచీ మైదానంలోని జిమ్‌లో..

కాగా, భారత క్రికెట్ చరిత్రలో ధోనికి కెప్టెన్‌గా మరిచిపోలేని స్థానం ఉంది. ధోని సారథ్యంలోనే భారత్ 2007 టీ20 వరల్డ్ కప్, 2010 ఆసియా కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2016 ఆసియా కప్ టోర్నీల్లో విజేతగా నిలిచింది. ఇక ఐపీఎల్‌లో కూడా ధోని స్థానం వేరే లెవెల్. ఐపీఎల్ 2023 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్‌ని 5వ సారి విజేతగా నిలిపిన ధోని.. లీగ్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా ముంబై ఇండియన్ సారథి రోహిత్ శర్మతో సమానంగా ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..

Latest Articles