Asian Games 2023: మలేషియాపై షఫాలీ విధ్వంసం.. నేరుగా సెమీస్‌కు చేరిన భారత్..

INDW vs MLYW, Asian Games 2023: ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచేందుకు భారత్ మహిళల జట్టు ఇంకో 2 అడుగుల దూరంలోనే ఉంది. వర్షానికి ముందు టాస్ గెలిచిన మలేషియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా వచ్చిన టీమిండియా కెప్టెన్ స్మృతీ మంధాన, షఫాలీ వర్మ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే కెప్టెన్ మంధాన 27 పరుగుల తర్వాత..

Asian Games 2023: మలేషియాపై షఫాలీ విధ్వంసం.. నేరుగా సెమీస్‌కు చేరిన భారత్..
Indian Women's Team
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 21, 2023 | 12:49 PM

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరింది. మలేషియా మహిళల జట్టుతో నేడు జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కి చేరింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్‌లో ఉండడంతో భారత్ సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిందని అంపైర్లు ప్రకటించారు. అంటే ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచేందుకు భారత్ మహిళల జట్టు ఇంకో 2 అడుగుల దూరంలోనే ఉంది. వర్షానికి ముందు టాస్ గెలిచిన మలేషియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా వచ్చిన టీమిండియా కెప్టెన్ స్మృతీ మంధాన, షఫాలీ వర్మ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే కెప్టెన్ మంధాన 27 పరుగుల తర్వాత వెనుదిరిగింది. అనంతరం షఫాలీతో జతకట్టేందుకు క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ 29 బంతుల్లోనే 6 ఫోర్లతో అజేయంగా 47 పరుగులు చేసింది.

ఇక ఓపెనర్‌గా వచ్చిన షఫాలీ అయితే 39 బంతుల్లోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 67 పరుగులు చేసి వెనుదిరిగింది. అనంతరం వచ్చిన రిచా ఘోష్ కేవలం 7 బంతుల్లోనే 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మొత్తం 21 పరుగులు చేసి రోడ్రిగ్స్‌‌తో పాటు అజేయంగా నిలిచింది. దీంతో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మలేషియాన్ బౌలర్లలో మహీరా ఇస్మాయిల్, మాస్ ఎలీసా చెరో వికెట్ తీసుకున్నారు.

ఇలా టీమిండియా ఇచ్చిన 174 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు మలేషియా క్రీజులోకి వచ్చి రెండు బంతులు ఆడగానే వర్షం మొదలైంది. ఎంతకీ వర్షం అగకపోవడంతో.. మ్యాచ్‌ని రద్దు చేసి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత్ సెమీస్‌కి అర్హత సాధించినట్లుగా అంపైర్లు ప్రకటించారు. దీంతో భారత మహిళల జట్టు సెప్టెంబర్ 24న తొలి సెమీ ఫైనల్‌లో ఆడనుంది. అయితే భారత్ ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..