AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో టార్చ్ బేరర్స్‌గా ఇద్దరు.. ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం.. ఎవరో తెలుసా?

Asian Games 2023 Flag Bearers: టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో లోవ్లినా కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 75 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. హర్మన్‌ప్రీత్ ప్రపంచంలోని అత్యుత్తమ డ్రాగ్-ఫ్లికర్లలో ఒకడిగా పేరుగాంచాడు. టోక్యో గేమ్స్‌లో చారిత్రాత్మక కాంస్యం గెలుచుకున్న జట్టులో భాగమయ్యాడు. నాలుగు దశాబ్దాలకు పైగా భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకాల కరువును అధిగమించేలా చేశారు.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో టార్చ్ బేరర్స్‌గా ఇద్దరు.. ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం.. ఎవరో తెలుసా?
Harmanpreet Singh, Lovlina Borgohain
Venkata Chari
|

Updated on: Sep 20, 2023 | 10:04 PM

Share

Asian Games 2023 Flag Bearers: హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఒలంపిక్ పతక విజేత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ సెప్టెంబరు 23న హాంగ్‌జౌలో జరిగే ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలో భారత బృందానికి పతాకధారులుగా ఉంటారు. కాంటినెంటల్ షోపీస్ కోసం జాయింట్ ఫ్లాగ్ బేరర్లు ఉండాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) బుధవారం నిర్ణయించింది.

ఈసారి ఆసియా గేమ్స్‌లో మొత్తం 655 మంది భారతీయ అథ్లెట్లు పోటీ పడుతున్నారు. ఇది ఇప్పటివరకు అతిపెద్ద బృందంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

“మేం ఈ రోజు చాలా చర్చల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాం” అని భారత కాంటింజెంట్ చెఫ్ డి మిషన్ భూపేందర్ సింగ్ బజ్వా పీటీఐకి తెలిపారురు.

“ఈసారి మేం ఆసియా క్రీడలలో ఇద్దరు టార్చే బేరర్‌లు ఉండాలని నిర్ణయించాం. హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్‌లు భారత బృందానికి ప్రాతినిథ్యం వహిస్తారు” అని వుషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బజ్వా తెలిపారు.

స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2018 జకార్తా ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలో టార్చ్ బేరర్‌గా ఉన్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో లోవ్లినా కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 75 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది.

హర్మన్‌ప్రీత్ ప్రపంచంలోని అత్యుత్తమ డ్రాగ్-ఫ్లికర్లలో ఒకడిగా పేరుగాంచాడు. టోక్యో గేమ్స్‌లో చారిత్రాత్మక కాంస్యం గెలుచుకున్న జట్టులో భాగమయ్యాడు. నాలుగు దశాబ్దాలకు పైగా భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకాల కరువును అధిగమించేలా చేశారు.

2024 పారిస్ ఒలింపిక్ క్రీడలకు స్వయంచాలకంగా అర్హత సాధించేందుకు భారత పురుషుల హాకీ జట్టు హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..