AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

County Championship: 7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. సెంచరీతో సత్తా చాటిన బ్యాటర్..

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించగలిగిన గడ్డపై కరుణ్ నాయర్ ఈ శక్తివంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి ఓవల్‌లో 8 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 232 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అతని అత్యుత్తమ స్కోరు 50 పరుగులు. యాదృచ్ఛికంగా, కోహ్లి కెప్టెన్సీలోనే కరుణ్ నాయర్ 2016లో టెస్టుల్లో అరంగేట్రం చేసి ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

County Championship: 7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. సెంచరీతో సత్తా చాటిన బ్యాటర్..
Karun Nair Century
Venkata Chari
|

Updated on: Sep 20, 2023 | 9:36 PM

Share

County Championship: ODI ప్రపంచకప్ 2023, ఆస్ట్రేలియాతో జరిగే ODI సిరీస్‌లో సంజూ శాంసన్‌కు టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంపై చర్చ కొనసాగుతోంది. చాలా మంది అనుభవజ్ఞులు, విమర్శకులు, అభిమానులు శాంసన్‌ను విస్మరించడం పూర్తిగా తప్పు అని చెబుతున్నారు. అయితే, విస్మరించడం వల్ల చాలా గందరగోళం సృష్టించిన మొదటి ఆటగాడు శాంసన్ కాదు. కొన్నేళ్ల క్రితం అలాంటి మరో బ్యాట్స్‌మెన్‌ టీమ్‌ఇండియా నిర్లక్ష్యానికి గురికాగా, ఇప్పుడు ఇదే బ్యాట్స్‌మెన్ విదేశాలకు వెళ్లి తన ప్రతిభను చాటుకున్నాడు. అది కూడా విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు కూడా కష్టపడాల్సిన గడ్డపై ఆకట్టుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ గురించే మాట్లాడుతున్నాం.

చెతేశ్వర్ పుజారా, జయదేవ్ ఉనద్కత్ వంటి దిగ్గజాల మాదిరిగానే, కర్ణాటక బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ కూడా ఈ రోజుల్లో ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తన చేతిని ప్రయత్నిస్తున్నాడు. కరుణ్ ఇక్కడ నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడుతున్నాడు. గత నెల వరకు పృథ్వీ షా కూడా అదే జట్టు తరపున వన్డే కప్‌లో తన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను తిరిగి ప్రారంభించడంతో, కరుణ్ నాయర్ నార్తాంప్టన్‌షైర్‌లో భారత బ్యాటింగ్‌లో సత్తా చాటాడు.

ఇవి కూడా చదవండి

రెండో మ్యాచ్‌లో కరుణ్‌ సెంచరీ..

కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో 78 పరుగులతో ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ ఆ తర్వాతి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. లండన్‌లోని ఓవల్‌ మైదానంలో సర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు కరుణ్‌ నాయర్‌ సెంచరీ పూర్తి చేశాడు. తొలిరోజు 51 పరుగులు చేసిన కరుణ్ రెండో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయే ముందు సెంచరీ పూర్తి చేశాడు. ఆట ఆగిపోయే వరకు కరుణ్ నాయర్ 144 పరుగులు చేసి క్రీజులో నిలుచున్నాడు.

కరుణ్ ఈ సెంచరీని తన జట్టుకు పరుగులు చేయాల్సిన అవసరం ఉన్న సమయంలో సాధించాడు. కేవలం 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ జట్టును ఆదుకున్నాడు. ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మెన్ టామ్ టేలర్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును 300 పరుగులు దాటించాడు.

ఓవల్‌లో విరాట్ కోహ్లి కూడా విఫలం..

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించగలిగిన గడ్డపై కరుణ్ నాయర్ ఈ శక్తివంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి ఓవల్‌లో 8 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 232 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అతని అత్యుత్తమ స్కోరు 50 పరుగులు. యాదృచ్ఛికంగా, కోహ్లి కెప్టెన్సీలోనే కరుణ్ నాయర్ 2016లో టెస్టుల్లో అరంగేట్రం చేసి ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ అతనికి జట్టులో అవకాశం రాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..