- Telugu News Photo Gallery Cricket photos From Mohammed Siraj to Jasprit Bumarh These 6 Team India bowlers who have been Top In ODI rankings check full details
ICC ODI Rankings: ICC ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఆరుగురు భారత బౌలర్లు.. అగ్రస్థానం ఎవరిదో తెలుసా?
ICC ODI Rankings: మహమ్మద్ సిరాజ్ కంటే ముందు ఐదుగురు భారత బౌలర్లు వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో పాటు ఈ ఘనత సాధించిన 6వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఆ భారత బౌలర్లు ఎవరనేది ఇఫ్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 20, 2023 | 9:23 PM

ICC ODI Rankings: ఐసీసీ ప్రకటించిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో పాటు ఈ ఘనత సాధించిన 6వ భారత బౌలర్‌గా నిలిచాడు. అంటే మహ్మద్ సిరాజ్ కంటే ముందు ఐదుగురు భారత బౌలర్లు వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1- మణిందర్ సింగ్: టీమ్ ఇండియా తరపున ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి బౌలర్ మణిందర్ సింగ్. 80వ దశకంలో భారత్ తరపున ఆడిన మణిందర్ 1987లో అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియా తరఫున 59 వన్డేలు ఆడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మణిందర్ సింగ్ మొత్తం 66 వికెట్లు పడగొట్టాడు.

2- కపిల్ దేవ్: మణిందర్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ కపిల్ దేవ్. టీమిండియా తరపున 225 వన్డే మ్యాచ్‌లు ఆడిన కపిల్ పాజీ మొత్తం 253 వికెట్లు పడగొట్టాడు. మధ్యలో, 1989లో, అతను వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు.

3- అనిల్ కుంబ్లే: ఈ జాబితాలో అనిల్ కుంబ్లే కూడా ఉన్నాడు. 271 మ్యాచుల్లో 337 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే భారత్ తరపున అత్యధిక వన్డే వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విశేషమేమిటంటే 1996లో అనిల్ కుంబ్లే ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో మెరిశాడు.

4- రవీంద్ర జడేజా: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 2013లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. దీంతో ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు.

5- జస్‌ప్రీత్ బుమ్రా: టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో 2018లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు.

6- మహ్మద్ సిరాజ్: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌లో మొత్తం 10 వికెట్లు తీసి ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో భారత్ తరపున ఈ ఘనత సాధించిన 6వ బౌలర్‌గా, 3వ అత్యంత వేగంగా బౌలర్‌గా నిలిచాడు.




