- Telugu News Photo Gallery Relationship Tips: Eat These 5 natural aphrodisiacs which are backed by science, and will ease your libido problems
Relationship: ఇద్దరూ ఆ విషయంలో వీక్‌గా ఉన్నారా..? ఈ ఐదు పదార్థాలతో సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు..
ప్రస్తుత కాలంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషులు, మహిళలు లైంగిక (లిబిడో-ప్రేరిత) పరమైన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు సహజమైన కామోద్దీపనలను ప్రయత్నించడం ద్వారా లైంగిక కోరికలను పెంచుకోవచ్చు.
Updated on: Feb 28, 2023 | 1:33 PM

ప్రస్తుత కాలంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషులు, మహిళలు లైంగిక (లిబిడో-ప్రేరిత) పరమైన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు వంటగదిలో ఉండే పలు రకాల పదార్థాలతో లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని.. సైన్స్ చెబుతోంది. సహజమైన కామోద్దీపనలను ప్రయత్నించడం ద్వారా లైంగిక కోరికలను పెంచుకోవడంతోపాటు పలు సమస్యల నుంచి బయటపడొచ్చు.

ఆహారం, సెక్స్ మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి.. లైంగిక జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవాలంటే కొన్ని ఆహార పానీయాలను తీసుకోవాలి. ఇవి, మహిళలు, పురుషుల్లో కామోద్దీపనలు- లైంగిక కోరికలను పెంచడంతోపాటు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

లిబిడో-బూస్టింగ్ కు శాస్త్రీయంగా ఆధారాలతో నిరూపితమైన కొన్ని పదార్థాలు వంటగదిలోనే ఉన్నాయని.. ఈ సమస్యతో బాధపడుతున్నవారు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, కొన్ని పదార్థాల పానీయాలు తీసుకోవడం వల్ల సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

మెంతులు: మెంతులు ఎప్పటి నుంచో మన దేశీ ఆహారంలో ప్రధానమైనవి. ఆయుర్వేదంలో కూడా వీటి గురించి ప్రస్తావించారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, లిబిడో-బూస్టింగ్ కోసం ఉపయోగపడతాయని.. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, కొరియన్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసిన అధ్యయనాలలో తెలింది. మెంతులుసెక్స్ హార్మోన్లు ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ సమతుల్య ఉత్పత్తిలో సహాయపడుతుందని కనుగొన్నారు.

పిస్తా పప్పులు: పిస్తా పప్పుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఇవి ప్రధానంగా ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. నట్స్ రక్తపోటును తగ్గించడంతోపాటు గుండె జబ్బుల ప్రమాదం నుంచి కాపడతాయి. అయితే, అంగస్తంభనతో బాధపడేవారు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు పిస్తా గింజలను తినాలని సూచిస్తున్నారు. పిస్తా డైట్, పిస్తా నీరు లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని నిరూపితమైంది.

కుంకుమపువ్వు: కుంకుమపువ్వు పాలలో కలుపుకుని తాగుతారు. ఇది సువాసనతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కుంకుమ పువ్వు లైంగిక జీవితానికి వరంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు సహాయపడుతుంది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన రెండు అధ్యయనాలలో నాలుగు వారాల పాటు ప్రతిరోజూ 30 mg కుంకుమపువ్వు తినే పురుషులు అంగస్తంభన పనితీరులో మెరుగుదల కనిపించినట్లు నిర్దారణ అయింది.

పుచ్చకాయ: పుచ్చకాయను సహజ వయాగ్రా అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసవిలో అధికంగా లభించే పుచ్చకాయతో లైంగిక శక్తి పెరుగుతుందని తేలింది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో పుచ్చకాయ అనేది సిట్రుల్లైన్ కాని అమైనో ఆమ్లాల గొప్ప మూలం. ఫైటోన్యూట్రియెంట్ సిట్రులిన్ రక్త నాళాలను సడలించడంతోపాటు.. విస్తరిస్తుంది. దీనివల్ల లైంగిక జీవితం ఆనందమయంగా మారుతుంది. అయితే, లైంగిక శక్తి కోసం పుచ్చకాయ తొక్క కూడా తినవచ్చని పేర్కొంది.

దానిమ్మ: దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి. దానిమ్మ తినడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. దానిమ్మపండు లోపల ఉండే గింజలు సంతానోత్పత్తి, సమృద్ధికి చిహ్నంగా గుర్తిస్తారు. ఎడిన్‌బర్గ్‌లోని క్వీన్ మార్గరెట్ యూనివర్శిటీ చేసిన అధ్యయనంలో దానిమ్మ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తగ్గుతుందని కనుగొన్నారు. ఒత్తిడి హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు ఇది దాని లిబిడో-బూస్టింగ్ శక్తిని పెంచుతుందని నిరూపితమైంద.ి






























