- Telugu News Photo Gallery Cinema photos Actress Pragya Jaiswal Latest Photos Goes Viral In Social Media telugu cinema news
Pragya Jaiswal: చిరునవ్వుతోనే గుండెల్లో అలజడి సృష్టిస్తోన్న ప్రగ్యా.. అయినా అదృష్టం చెంతలేదుగా..
అందంతోనే కట్టిపడేసే సౌందర్యాలు. ఎప్పటికీ మర్చిపోలేనే సహజ నటన. అయినా అదృష్టానికి మాత్రం ఆమడ దూరం. బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వారి జాబితాలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.
Updated on: Feb 28, 2023 | 1:12 PM

అందంతోనే కట్టిపడేసే సౌందర్యాలు. ఎప్పటికీ మర్చిపోలేనే సహజ నటన. అయినా అదృష్టానికి మాత్రం ఆమడ దూరం. బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వారి జాబితాలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.

బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా సెన్సెషనల్ హిట్ ఖాతాలో వేసుకుంది ప్రగ్యా. నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన నటించి మెప్పించింది. ఇందులో ప్రగ్యా నటనతో.. అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా.. ఆ తర్వాత ప్రగ్యా నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటుంది.

వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగు తెరపై స్పషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రగ్యా. ఏమాత్రం గ్లామర్ షో లేకుండానే నటనతో కట్టిపడేసింది.

దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రగ్యా చేసింది మాత్రం అతి తక్కువ చిత్రాలే. హిట్స్ అందుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు.

అయితే ఈ అమ్మడు మాత్రం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటుంది ప్రగ్యా.

తాజాగా వైట్ అండ్ వైట్ కుర్తీలో చిరునువ్వులు చిందిస్తూ ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరీ చూడాలి రాబోయే రోజుల్లో ప్రగ్యా తెలుగులో బిజీ కానుందేమో.

చిరునవ్వుతోనే గుండెల్లో అలజడి సృష్టిస్తోన్న ప్రగ్యా.. అయినా అదృష్టం చెంతలేదుగా..





























