AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay: టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌కు బిగ్‌ షాక్.. విడాకులు కోరుతూ కోర్టుకెళ్లిన భార్య! ఎందుకంటే?

తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్‌కి బిగ్‌ షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన సతీమణి చెంగల్పట్టు కోర్టులో డైవర్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. విజయ్‌ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొంది.

Thalapathy Vijay: టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌కు బిగ్‌ షాక్.. విడాకులు కోరుతూ కోర్టుకెళ్లిన భార్య! ఎందుకంటే?
Tvk Chief Thalapathy Vijay Wife Sangeetha Sornalingam Files For Divorce
Anand T
|

Updated on: Feb 27, 2026 | 5:34 PM

Share

నటుడు, టీవీకే చీఫ్ విజయ్‌ లైఫ్‌లో బిగ్ ట్విస్ట్‌ నెలకొంది. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సంగీత ఇలా పేర్కొంది. విజయ్ ఒక నటితో సంబంధంలో ఉన్నాడని.. ఆ నటితో తనకున్న సంబంధం గురించి తనకు 2021 ఏప్రిల్‌లో తెలిసిందని పేర్కొంది. విజయ్ ఆ నటితో కలిసి విదేశాలకు వెళ్లాడని.. ఆ ఫోటోలను ఆ నటి స్వయంగా షేర్ చేసిందని తెలిపింది. ఆ నటి కారణంగా తాను, తన పిల్లలు అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ విజయ్ ఎలాంటి విచారం లేకుండా ఆ నటితో టచ్‌లో ఉన్నాడు అని పేర్కొంది.

ఇదిలా ఉండగా ఇటీవల విజయ్‌ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తిరేపుతున్న వేళ ఆయన భార్య సంగీత విడాకుల నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆయన రాజకీయ ప్రయాణంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు విజయ్‌ వ్యక్తిగత జీవితంపై ఇటీవల బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్‌ వ్యాఖ్యలు చేయడం దీనికి మరింత ఆజ్యం పోసింది.

Vijay

Vijay

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us