AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంగూలీ నుంచి ఆమిర్ ఖాన్ వరకు.. డూయోలాగ్ విత్ బరున్ దాస్ సీజన్ 4.. ఎప్పటినుంచంటే..?

Duologue With Barun Das Season 4: క్రీడా ప్రపంచపు దిగ్గజాల నుండి.. వెండితెర పర్ఫెక్ట్ నటుడి వరకు.. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాలలో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన లెజెండ్స్ మనసులో ఏముంది? వారి ఆలోచనలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డూయోలాగ్ విత్ బరున్ దాస్ సీజన్ 4. ఫిబ్రవరి 28 నుండి సరికొత్త సీజన్ ప్రారంభం కానుంది.

గంగూలీ నుంచి ఆమిర్ ఖాన్ వరకు.. డూయోలాగ్ విత్ బరున్ దాస్ సీజన్ 4.. ఎప్పటినుంచంటే..?
Duologue With Barun Das Returns With Season 4
Krishna S
|

Updated on: Feb 27, 2026 | 5:23 PM

Share

ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులతో లోతైన చర్చలకు వేదికైన వేదికైన డూయోలాగ్‌ విత్ బరున్ దాస్ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాడికో సమర్పిస్తున్న ఈ ప్రతిష్టాత్మక షో నాలుగవ సీజన్ (Duologue With Barun Das Season 4) .. ఫిబ్రవరి 28 నుండి ప్రారంభం కానుంది. గత మూడు సీజన్ల సక్సెస్ తర్వాత వస్తున్న ఈ సీజన్ మరింత ఆకర్షణీయమైన లైనప్‌తో రాబోతోంది. TV9 నెట్‌వర్క్ MD, CEO బరున్ దాస్ ఈ షోను కేవలం ప్రశ్నలు అడిగే టాక్ షోలా కాకుండా వివిధ రంగాలలోని గొప్ప వ్యక్తుల ఆలోచనలను ప్రపంచానికి తెలిపే అద్భుతమైన వేదికలా రూపొందించారు. ‘‘లెజెండ్స్‌తో మాట్లాడటం నాకు కొత్త విషయాలు నేర్పింది. ఈ దిగ్గజాలకు, ప్రేక్షకులకు మధ్య ఉన్న దూరాన్ని ఈ షో తగ్గిస్తుంది’’ అని బరున్ దాస్ చెప్పారు. ఈ చర్చలు మన జీవితాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. ప్రస్తుత కాలానికి సంబంధించిన కీలక ప్రశ్నలను లేవనెత్తుతూ, సమాజాన్ని మంచి మార్గంలో మలచడానికి ప్రయత్నిస్తున్న వారి ద్వారా జ్ఞానాన్ని అంచనా వేసే ప్రయత్నమే ఈ డూయోలాగ్‌ విత్ బరున్ దాస్.

బ్లాక్ బస్టర్ లైనప్ (ఎపిసోడ్ వివరాలు):

ఈ సీజన్‌లో ప్రపంచ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఐదుగురు దిగ్గజాలు పాల్గొననున్నారు.

సౌరవ్ గంగూలీ (ఫిబ్రవరి 28): భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన దాదా..  క్రికెట్‌లో గెలుపు అనే ధోరణిని ఎలా పెంపొందించారో ఆయన పంచుకుంటారు.

విజయ్ అమృతరాజ్ (మార్చి 1): టెన్నిస్‌లో భారత సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన లెజెండ్. నటనను కూడా తన రెండవ కెరీర్‌గా విజయవంతంగా మలుచుకున్న విజయ్ అమృతరాజ్‌తో ఆసక్తికరమైన సంభాషణ ఉంటుంది.

లోథర్ మాథ్యూస్ (మార్చి 7): 1990 FIFA ప్రపంచ కప్‌లో పశ్చిమ జర్మనీని విశ్వవిజేతగా నిలిపిన ఫుట్‌బాల్ లెజెండ్. తన సుదీర్ఘ కెరీర్, కష్టాలను అధిగమించిన విధానం గురించి మాట్లాడతారు.

బియాంకా బాల్టి (మార్చి 8): ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఐకాన్. ఆమె జీవిత కథ అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతికూల పరిస్థితులను అవకాశాలుగా మార్చుకుని ఎలా ఎదిగారనే విషయాలను వెల్లడిస్తారు.

ఆమిర్ ఖాన్ (మార్చి 14): బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, అద్భుతమైన నటుడు. సినిమా రంగంపై ఆయన ఆలోచనలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకునే విధానంపై సుదీర్ఘ చర్చ ఉంటుంది.

ఈ ఎపిసోడ్‌లు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా ఈ లెజెండ్స్ జీవిత అనుభవాల నుండి ఎంతో జ్ఞానాన్ని అందిస్తాయి. మన కాలానికి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతూ, సమాజాన్ని మెరుగుపరిచే ఆలోచనలను ఈ షో అందిస్తుంది.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..