Men Health: మగ మహారాజులకు వరం అశ్వగంధ.. ఇలా చేస్తే శక్తితోపాటు ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం విషయానికి వస్తే ఆయుర్వేదం ఉత్తమమైనది.. అని తరచుగా పలువురు నిపుణులు చెబుతుంటారు.

Men Health: మగ మహారాజులకు వరం అశ్వగంధ.. ఇలా చేస్తే శక్తితోపాటు ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..
Relationship Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 16, 2023 | 9:50 PM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం విషయానికి వస్తే ఆయుర్వేదం ఉత్తమమైనది.. అని తరచుగా పలువురు నిపుణులు చెబుతుంటారు. ప్రకృతి మనకు ఎన్నో వనమూలికలను అందించింది. వాటి సహాయంతో మనం మన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. ఆయుర్వేదం చెప్పిన ఆరోగ్య సూత్రాల్లో.. తరచుగా అశ్వగంధ పేరును చెబుతుంటారు. దీనిని ఔషధం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. అశ్వగంధ సహాయంతో మనం అనేక శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. లైంగిక, సంతానోత్పత్తి సమస్యలతో బాధపడేవారు తీసుకుంటే.. వాటిని అధిగమించవచ్చు.. అయితే, అశ్వగంధ నుంచి మనం శారీరకంగా, మానసికంగా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

అశ్వగంధ ప్రయోజనాలు..

ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది: అశ్వగంధ మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే దీనిని స్ట్రెస్ బస్టర్ అంటారు. ప్రస్తుతం నూటికి 80శాతం మంది ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారు. అలాంటి బాధితులు ఫార్మాస్యూటికల్ ఔషధాలకు సహజ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తుంటే.. అశ్వగంధ సప్లిమెంట్స్ ట్రై చేయవచ్చు. ఇది శరీరంలో టెన్షన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

అశ్వగంధ ఎలా ప్రభావితం చేస్తుంది?

అశ్వగంధలో ప్రశాంతత, ఆరోగ్యం లాంటి భావాలను ప్రోత్సహించే సమ్మేళనాలు ఉన్నాయి. ఇది రాత్రి వేళ మంచిగా నిద్ర పొవడానికి సహాయపడుతుంది. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడంతోపాటు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా వచ్చే గ్యాస్ట్రిక్ అల్సర్‌లను తగ్గించడంలో అశ్వగంధ సహాయపడుతుందని అనేక పరిశోధనలలో కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

పురుషుల్లో ‘శక్తి’ని పెంచుతుంది..

ఆందోళనను తగ్గించే సామర్థ్యం ఉన్న అశ్వగంధ.. సహజంగా లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. లైంగిక బలహీనతకు ఒత్తిడి ఎక్కువగా కారణమవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి మన శరీరాలపై వినాశన ప్రభావాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించే విషయంలో.. అశ్వగంధను సేవించడం వల్ల పురుషులలో లిబిడో పెరుగుతుంది. స్టామినా పెరగడంతోపాటు.. లైంగిక సమస్యలు దూరమవుతాయి. ఇంకా వీరకణాల ఉత్పత్తి కూడా మెరుగుపడుతుంది.

బలం పెరిగేలా చేస్తుంది..

అశ్వగంధ వినియోగం చాలా మంది ఆటగాళ్లకు ముఖ్యమైన శారీరక బలం, శక్తిని పెంచుతుంది. ఈ హెర్బ్ సహాయంతో అథ్లెట్ మొత్తం స్ప్రింట్, కండరాల శక్తి పెరుగుతుందని ఒక పరిశోధనలో కనుగొన్నారు.

ఆర్థరైటిస్‌లో ఉపశమనం..

అశ్వగంధ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఒక అధ్యయనంలో, ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 40 మందికి అశ్వగంధ, మూడు ఇతర సప్లిమెంట్‌ల కలయిక ఇచ్చారు. మూడు నెలల వ్యవధి తర్వాత, అధ్యయనంలో పాల్గొన్నవారి కీళ్ళు, చలనశీలతలో గణనీయమైన మెరుగుదలను కనుగొన్నారు.

ఏకాగ్రత మెరుగుపడుతుంది..

అశ్వగంధ కూడా మీ దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అశ్వగంధ అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రతిచర్య సమయం, మానసిక గణిత సామర్థ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. అశ్వగంధ సప్లిమెంట్స్ అల్జీమర్స్ వంటి వ్యాధుల నష్టాన్ని కూడా నివారించవచ్చు.

(గమనిక: ఈ వార్త కేవలం అవగాహన కోసం మాత్రమే.. దీనిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.. దీనిని ధృవీకరించడంలేదు.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..