AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు.. ఆపి బ్యాగులు చెక్ చేయగా..

రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఇద్దరు వ్యక్తలు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు.. ఈ క్రమంలో అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేయగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు.. ఆపి బ్యాగులు చెక్ చేయగా..
Secunderabad Railway Station
Shaik Madar Saheb
|

Updated on: Mar 12, 2023 | 2:04 PM

Share

రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఇద్దరు వ్యక్తలు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు.. ఈ క్రమంలో అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేయగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వేర్వేరు రైల్వే స్టేషన్లలో అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి కోట్లాది రూపాయాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్, శ్రీకాకుళం రైల్వేస్టేషన్లలో భారీగా బంగారం పట్టుబడింది.

అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఓ నిందితుడ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డైరెక్టరేట్ ఆఫ్ ఇంటిలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.32 కోట్ల విలువైన 2.31 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఈ బంగారాన్ని కలకత్తాలో కొనుగోలు చేసి, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అక్కడి నుంచి ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కోసం జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. దీనిపై మరింత విచారణ కొనసాగుతోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లోనూ 7.396 కేజీల బంగారం పట్టుబడింది. చెన్నై మెయిల్ (హౌరా నుంచి చెన్నై) ద్వారా కోల్‌కతా నుంచి శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఒక వ్యక్తి వద్ద అధికారులు బంగారాన్ని గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని బ్యాగును పరిశీలించగా.. బంగారం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ. 4.21 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ అక్రమ రవాణాపై రైల్వే పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. స్మగ్లర్లు పంథాను మార్చి రైళ్లలో అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత