Hyderabad: జర్మనీ, దక్షిణా కొరియా తర్వాత హైదరాబాద్‌లోనే.. వచ్చే వేసవి నాటికి నిర్మాణం పూర్తయ్యేలా ఏర్పాట్లు.
నగరంలో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ, తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, పార్కులను నిర్మిస్తున్న హెచ్‌ఎండీఏ...
నగరంలో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ, తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, పార్కులను నిర్మిస్తున్న హెచ్‌ఎండీఏ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ పట్టణాలకు పోటీగా ఈ నిర్మాణాన్ని చేపడుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
రింగు రోడ్డు వెంట 23 కిలోమీటర్ల పొడవునా ఈ సైక్లింగ్ ట్రాక్‌ను నిర్మించనున్నారు. వచ్చే వేసవి నాటికి ఈ సైక్లింగ్ ట్రాక్‌ను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట ఐటీ కారిడార్ పరిధిలోని నానక్‌రాంగూడ, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ, కోకాపేట, కొల్లూరు ప్రాంతాల్లోని ఓఆర్‌ఆర్ లోపలి వైపు ఉన్న సర్వీసు రోడ్డులో 4.5 మీటర్ల వెడల్పుతో ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే నగంరలో ఇప్పటికే సైక్లింగ్ ట్రెండ్ పెరుగుతోంది. ఐటీ ఎంప్లాయిస్ వీకెండ్స్‌లో నగర శివార్లలో సైక్లింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ప్రత్యేకంగా ట్రాక్ వేస్తోంది. ఇదిలా ఉంటే ఇలాంటి సైకిల్ ట్రాక్ ఇప్పటి వరకు జర్మనీ, దక్షిణ కొరియాల్లో ఉండగా ఇప్పుడు ఈ జాబితాలోకి భాగ్యనగరం చేరుతుండడం విశేషం. భవిష్యత్‌లో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీలు నిర్వహించడంతో పాటు స్థానికంగా ఉన్న ఐటీ ఉద్యోగులు, యువతకు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఇక ట్రాక్ వెంట.. సైకిళ్లు అద్దెకిచ్చే కేంద్రాలు, మరమ్మతులు చేసే వ్యవస్థ, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ సైతం ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..