Tourist Places: ఈ ఎండాకాలం సెలవుల్లో ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? తప్పక చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇవి..

ఫ్యామిలీతో చేసే ట్రావెల్ సరదాయే వేరు. కొత్త ప్రదేశాలను తెలుసుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యుల గురించి కూడా చాలా తెలుసుకుంటారు.

Jyothi Gadda

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 17, 2023 | 2:56 PM

చాలా మంది ప్రతి సంవత్సరం సెలవులకు కుటుంబంతో కలిసి ఏదైన బెస్ట్‌ టూర్‌ వెళ్లాలని ప్లాన్ చేస్తారు. మీరు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా..? అలా వెళ్లటమనేది మంచి మానసిక ఆరోగ్యానికి, బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకు అనువైన పర్యాటక ప్రదేశాల కోసం మీరు పెద్దగా సెర్చ్‌ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కొన్ని మంచి టూరిస్ట్‌ ప్లేస్‌లు సూచించాము.. ఒకసారి ప్లాన్‌ చేసి చూడండి..

1 / 4
Andaman Nicobar Islands : అండమాన్- నికోబార్ ద్వీపం: అండమాన్ మరియు నికోబార్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. పచ్చని అడవుల్లో, బీచ్‌లో నడవాలంటే ఉండే మజా వేరు.  మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే ఇష్టం ఉంటే ఇక్కడ స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ కూడా చేయవచ్చు.

2 / 4
Kashmir: భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కాశ్మీర్‌ ఒకటి.దేశ, విదేశాల నుండి అనేక మంది పర్యాటకులు కశ్మీర్‌ అందాలని చూడడానికి తరలి వస్తూ ఉంటారు. కాశ్మీరును ప్రకృతి ప్రేమికులు “భూతల స్వర్గం” అని అంటారు. రమణీయమైన ప్రకృతితో ఎంతో శోభాయమానంగా ఉంటుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ దాల్ సరస్సు పైన పడవటింట్లోంచి చూస్తూ అక్కడి సౌందర్యానికి ముగ్ధుడై భూమి మీద స్వర్గం ఎక్కడైనా ఉంటే అది ఇక్కడే అన్నారట.

3 / 4
Ooty: మీరు ఈ సారి సెలవుల్లో ఊటీ ట్రిప్‌ ఎంచుకోవచ్చు. దట్టమైన ఆకుపచ్చని లోయలు, మర్మమైన మార్గాలు, మీ తలను ముద్దాడే మేఘాలు.. మంత్రముగ్దులను చేసే టీ తోటలు, సహజ సరస్సులు, ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని అలరింపజేస్తుంది. ఈ ప్రదేశంలో మీరు మీ కుటుంబంతో హాయిగా గడపగలుగుతారు.

4 / 4
Follow us