Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయోచ్చా, చేయకూడదా..? నిపుణులు ఏమంటున్నారంటే..?

Health Tips: సీజనల్ సమస్యల నివారణను కొందరు వదిలేస్తే, మరి కొందరు వెంటనే వైద్య నిపుణులను సంప్రదిస్తారు. అయితే సీజన్ కారణంగా లేదా శరీర ఆనారోగ్యం కారణంగా జ్వరం వచ్చినప్పుడు చాలా మంది స్నానం చేయాలా వద్దా..? అనే ప్రశ్నతో సతమతమవుతారు. అసలు దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..? వారి సూచనల మేరకు జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా..? తెలుసుకుందాం.. 

Health Tips: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయోచ్చా, చేయకూడదా..? నిపుణులు ఏమంటున్నారంటే..?
Fever And Bath
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 18, 2023 | 1:18 PM

Health Tips: మారుతున్న వాతావరణంతో పాటు అకాల వర్షాలు కూరిసినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో తరచూ దగ్గు, జలుబు, జ్వరం, డెంగ్యూ, చలి జ్వరం, దద్దుర్లు వంటి సీజనల్ సమస్యలు వ్యాపిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇక ఈ సమస్యల నివారణను కొందరు వదిలేస్తే, మరి కొందరు వెంటనే వైద్య నిపుణులను సంప్రదిస్తారు. అయితే సీజన్ కారణంగా లేదా శరీర ఆనారోగ్యం కారణంగా జ్వరం వచ్చినప్పుడు చాలా మంది స్నానం చేయాలా వద్దా..? అనే ప్రశ్నతో సతమతమవుతారు. అసలు దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..? వారి సూచనల మేరకు జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా..? తెలుసుకుందాం..

జ్వరం వచ్చినప్పుడు చాలా మంది స్నానం చేయడం మానేస్తారు, కొందరు స్నానం చేస్తారు. ఇక జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. అయితే నిపుణుల ప్రకారం జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం కంటే గోరువెచ్చని నీటిలో ముంచిన క్లాత్‌తో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం శుభ్ర పడడమే కాక మానసికంగా కంఫర్ట్ అనుభూతి కలుగుతుంది.

అలాగే వైరల్ ఫీవర్, లేదా ఫీవర్ వచ్చిన వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి సరైన వైద్యం చేయించుకోవాలి. కానీ కొందరు ఇంట్లోనే టాబ్లెట్స్ వేసుకుని జ్వరాన్ని నయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అలా చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లి తగు సలహా తీసుకోవడం తప్పనిసరి, ఆరోగ్యానికి మంచిది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు జ్వరం వచ్చిన తర్వాత కూడా వేడి నీరు, ఆవిరి, అల్లం టీ తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి విశ్రాంతి అనుభూతి కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..