Jaggery Tea: బెల్లం టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తిలిస్తే అసలు వదిలి పెట్టలేరు..
Jaggery Tea: టీ లేదా కాఫీని నిత్యం తాగడం వల్ల జీర్ణ సమస్యలు, గుండెలో మంట, తలనొప్పి, కెఫిన్ కారణంగా క్యాన్సర్, నిద్రలేమి సమస్యలు, డయాబెటీస్ వంటి పలు ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ క్రమంలో టీ, కాఫీలకు దూరంగా ఉండి బెల్లం టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు..
Jaggery Tea: చురుగ్గా ఉండేందుకు, ఆలసట నుంచి ఉపశమనం పొందేందకు చాలా మంది టీ, కాఫీ తాగుతుంటారు. టీ లేదా కాఫీ ద్వారా అలసట నుంచి ఉపశమనం కలిగి శరీరం చురుగ్గా ఉన్నా.. అవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. టీ లేదా కాఫీని నిత్యం తాగడం వల్ల జీర్ణ సమస్యలు, గుండెలో మంట, తలనొప్పి, కెఫిన్ కారణంగా క్యాన్సర్, నిద్రలేమి సమస్యలు, డయాబెటీస్ వంటి పలు ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ క్రమంలో టీ, కాఫీలకు దూరంగా ఉండి బెల్లం టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం ద్వారా శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అలాగే వేడి వేడి బెల్లం టీ తాగితే శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అసలు బెల్లం టీ తాగితే ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మైగ్రేన్ మాయం: ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల్లోని వివిధ బాధ్యతల కారణంగా ఎదురయ్యే సర్వసాధారణ సమస్య తలనొప్పి. ఈ తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తే, లేదా ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే మైగ్రేన్‌గా మారే అవకాశం కూడా ఉంది. అయితే మైగ్రేన్ సమస్యను బెల్లం టీతో పరిష్కరించుకోవచ్చు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు అందుకోసం పనిచేస్తాయి.
బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునేవారికి బెల్లం టీ చక్కని ఎంపిక. దీనిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా మీరు బరువు తగ్గగలుగుతారు.
జీర్ణ క్రియ: బెల్లంలోని విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కారణంగా జీర్ణ క్రియ రేటు మెరుగుపడుతుంది. ఫలితంగా మలబద్ధకం, కడుపు మంట, అజీర్తి, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
రక్తహీనతకు చెక్: శరీరంలో ఐరన్ లోపం కారణంగా, లేదా పీరియడ్స్ కారణంగా చాలా మంది మహిళల్లో రక్తహీనత సమస్య ఉంటుంది. అలాంటివారికి బెల్లం టీ మేలు చేస్తుంది. బెల్లం టీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరిచి రక్తహీనత సమస్యను నిరోధిస్తుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..