AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Obesity: ఈ 4 రకాల చపాతీలు మీ ఊబకాయాన్ని నియంత్రిస్తాయి.. నిపుణులు చెబుతున్న కీలక వివరాలు మీకోసం..

చాలా మంది తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి జిమ్ కి వెళ్లడం, గ్రౌండ్ వెళ్లి.. రకరకాల వర్కవుట్ లు చేస్తుంటారు. బరువు తగ్గడం అనేది చాలా సమయంతో కూడిన ప్రక్రియ. అందుకే చాలా మంది విసిగిపోయి.. మధ్యలోనే వ్యాయామాలు ఆపేస్తుంటారు. దానికి బదులుగా డైటింగ్ చేస్తుంటారు. తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా బరువు తగ్గకపోవడానికి కారణం. డైట్ సరిగ్గా లేకపోతే జిమ్ చేయడం ద్వారా కూడా బరువు తగ్గడం సాధ్యం కాదు.

Obesity: ఈ 4 రకాల చపాతీలు మీ ఊబకాయాన్ని నియంత్రిస్తాయి.. నిపుణులు చెబుతున్న కీలక వివరాలు మీకోసం..
Roti
Shiva Prajapati
|

Updated on: Sep 17, 2023 | 11:54 PM

Share

Obesity: చాలా మంది తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి జిమ్ కి వెళ్లడం, గ్రౌండ్ వెళ్లి.. రకరకాల వర్కవుట్ లు చేస్తుంటారు. బరువు తగ్గడం అనేది చాలా సమయంతో కూడిన ప్రక్రియ. అందుకే చాలా మంది విసిగిపోయి.. మధ్యలోనే వ్యాయామాలు ఆపేస్తుంటారు. దానికి బదులుగా డైటింగ్ చేస్తుంటారు. తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా బరువు తగ్గకపోవడానికి కారణం. డైట్ సరిగ్గా లేకపోతే జిమ్ చేయడం ద్వారా కూడా బరువు తగ్గడం సాధ్యం కాదు.

బరువు తగ్గడానికి, మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే వాటిని చేర్చడం చాలా ముఖ్యం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీవక్రియను బలపరుస్తుంది. అయితే బరువును వేగంగా తగ్గించే కొన్ని రోటీలు ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

బార్లీ రొట్టె..

బార్లీలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. బార్లీ రొట్టెలు తినడం వలన శరీరానికి పిండి పదార్థాలు, ప్రోటీన్, రాగి వంటి అన్ని పోషకాలను అందుతాయి. ఇవి మీ బరువును తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటాయి.

రాగి రొట్టె..

రాగులను మిల్లెట్ల వర్గంలో ఉంచుతారు. ఇది ముతక ధాన్యం. దీనితో చేసిన రొట్టెలు తినడం ద్వారా, పెరిగిన బరువును కొంతవరకు నియంత్రించవచ్చు. రాగుల్లో ఐరన్‌తో పాటు ప్రొటీన్‌, పీచు కూడా లభిస్తాయి. రాగి రోటీ గ్లూటెన్ ఫ్రీ. ఇది బరువు పెరగనివ్వదు.

మిల్లెట్ రొట్టె..

పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు మిల్లెట్ రోటీలో ఉంటాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మిల్లెట్ రోటీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

జొన్న రొట్టె..

ఇది కాకుండా, జొన్న రోటీ మీ శరీరంలో పెరుగుతున్న కొవ్వును కూడా తగ్గిస్తుంది. జొన్నలో థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలేట్, కాల్షియం, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, దీన్ని తినడం వల్ల బరువు కూడా చాలా వరకు అదుపులో ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..