AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Loss with Helmet: హెల్మెట్ పెట్టుకుంటే.. బట్ట తల వస్తుందా? అసలు నిజాలు తెలుసుకోండి!

బైక్, స్కూటీ వంటి ద్వి చక్ర వాహనాలు నడిపించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వేళ ఎలాంటి యాక్సిడెంట్ అయినా, బండి స్కిడ్ అయి పడిపోయినా.. ఇది మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే మన బాడీలో అత్యంత కీలకమైనది తల. తలలో ఏ చిన్న సమస్య వచ్చినా.. జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలని చెబుతూంటారు. కానీ చాలా మంది దీన్ని పట్టించుకోరు. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందని, బట్ట తల వస్తుందని, ఫేస్ స్కీన్ పాడవుతుందని ఇలా రక రకాల కారణాలు చెబుతారు. అయితే ఏదో ట్రాఫిక్ పోలీసుల బాధ భరించలేక, ఆ ఫైన్ లు..

Hair Loss with Helmet: హెల్మెట్ పెట్టుకుంటే.. బట్ట తల వస్తుందా? అసలు నిజాలు తెలుసుకోండి!
Helmet Benefits
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 17, 2023 | 8:58 AM

Share

బైక్, స్కూటీ వంటి ద్వి చక్ర వాహనాలు నడిపించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వేళ ఎలాంటి యాక్సిడెంట్ అయినా, బండి స్కిడ్ అయి పడిపోయినా.. ఇది మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే మన బాడీలో అత్యంత కీలకమైనది తల. తలలో ఏ చిన్న సమస్య వచ్చినా.. జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలని చెబుతూంటారు. కానీ చాలా మంది దీన్ని పట్టించుకోరు. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందని, బట్ట తల వస్తుందని, ఫేస్ స్కీన్ పాడవుతుందని ఇలా రక రకాల కారణాలు చెబుతారు. అయితే ఏదో ట్రాఫిక్ పోలీసుల బాధ భరించలేక, ఆ ఫైన్ లు కట్టలేక తప్పక హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందనేది మాత్రం అబద్ధం అని అంటున్నారు నిపుణులు. మరి ఇందులో నిజాలేంటో తెలుసుకుందాం.

చర్మం – జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి:

హెల్మెట్ పెట్టుకోవడం వల్ల దుమ్మూ, ధూళి పడకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. ఫేస్ కూడా నీట్ గా అవుతుందని అంటున్నారు. బట్ట తలకు, హెల్మెట్ కు సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు నిపుణులు. చుండ్రు సమస్యలు కూడా ఉండవు.

ఇవి కూడా చదవండి

గాలి తగిలే చోట హెల్మెట్ ని ఉంచాలి:

చాలా మంది హెల్మెట్ తీశాక.. ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. హెల్మెట్ ఎప్పుడూ గాలి తగిలే చోట పెడితే బెటర్. దీని వల్ల హెల్మెట్ లో పట్టే చమట పోతుంది. ఎండలో పెట్టినా మంచిదే. ఏమైనా బ్యాక్టీరియా వంటివి ఉంటే ఎండలో నశిస్తాయి.

ఒకరు వాడిన హెల్మెట్ మరొకరు వాడకూడదు:

ఒకరు వాడిన హెల్మెట్ ను మరొకరు వాడ కూడదు. ఎందుకంటే ఒకరి తలలో ఉండే చుండ్రు వంటి సమస్యలు.. మరొకరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హెల్మెట్లు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ వాడతో దాన్ని బాగా క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు.

హెల్మెట్ ను నేరుగా పెట్టకూడదు:

చాలా మంది హెల్మెట్ పెట్టుకునే విషయంలో ఈ చిన్న పొరపాటు చేస్తూంటారు. హెల్మెట్ ను ఎప్పుడూ నేరుగా ఉపయోగించ కూడదు. తలకు ముందు క్లాత్ కట్టి ఆ పైన హెల్మెట్ ను ఉంచాలి.

ఏది పడితే అది వాడకూడదు:

కొంత మంది హెల్మెట్టే కదా అని ఏది పడితే అది తీసుకుంటూ ఉంటారు. తక్కువ రేటుకు వస్తుంది కదా అని కొంటూంటారు. అలా చేయడం తప్పు. హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి.. కాస్త రేటు ఎక్కువైనా మంచిదే తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీవారి దర్శనం కల నెరవేరుతుందని ఆశపడితే.. రూ.51,800 మోసం చేసిన
శ్రీవారి దర్శనం కల నెరవేరుతుందని ఆశపడితే.. రూ.51,800 మోసం చేసిన
రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు.. ఏం జరిగిందంటే?
రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు.. ఏం జరిగిందంటే?
డీహైడ్రేషన్ నివారణకు కేవలం నీరు తాగితే సరిపోతుందా..?
డీహైడ్రేషన్ నివారణకు కేవలం నీరు తాగితే సరిపోతుందా..?
థాయ్‌లాండ్‌ టు హైదరాబాద్‌.. అలాంటి యువతే టార్గెట్.. కట్ చేస్తే
థాయ్‌లాండ్‌ టు హైదరాబాద్‌.. అలాంటి యువతే టార్గెట్.. కట్ చేస్తే
మరికొన్ని గంటల్లో TG PGECET 2026 ఫలితాలు.. డైరెక్ట్ లింక్
మరికొన్ని గంటల్లో TG PGECET 2026 ఫలితాలు.. డైరెక్ట్ లింక్
మాజీల మాట పెడచెవిన పెట్టి ఈ వయసులోనే వైభవ్‎కు ఛాన్స్ ఇస్తారా?
మాజీల మాట పెడచెవిన పెట్టి ఈ వయసులోనే వైభవ్‎కు ఛాన్స్ ఇస్తారా?
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న మద్యం ధరలు
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న మద్యం ధరలు
ఎప్పుడైనా ఎగ్ పకోడి ట్రై చేశారా? వర్షం పడుతుంటే తిన్నారో..
ఎప్పుడైనా ఎగ్ పకోడి ట్రై చేశారా? వర్షం పడుతుంటే తిన్నారో..
పెద్ది సినిమాలో జాన్వీ ఫ్రెండ్.. బయట ఎంత క్యూట్‌గా ఉందో..
పెద్ది సినిమాలో జాన్వీ ఫ్రెండ్.. బయట ఎంత క్యూట్‌గా ఉందో..
అబ్బబ్బ.. సూపర్‌ఫుడ్.. చికెన్ లివర్‌తో ఆ సమస్యలన్నీ మటుమాయం
అబ్బబ్బ.. సూపర్‌ఫుడ్.. చికెన్ లివర్‌తో ఆ సమస్యలన్నీ మటుమాయం