Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Problems: ఇవి తీసుకుంటే కిడ్నీ సమస్యలే రావు.. ఎంతో చక్కగా వర్క్ చేస్తాయి!!

మానవ శరీరంలో ఉన్న విష పదార్థాలను, మలినాలను బయటకు పంపడంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాగే మూత్ర పిండాలు శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తాయి. మూత్ర పిండాలు సరిగ్గా వర్క్ చేయకపోతే.. చాలా నష్టాలు వాటిల్లే ప్రమాదం. మన బాడీలో ప్రతీది ముఖ్యమే. వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాత్రం మనమే వహించాలి. ప్రస్తుతం ఇప్పుడు 100 మందిలో దాదాపు 10 మంది మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. మూత్ర పిండాల సమస్యలు తలెత్తగానే..

Kidney Problems: ఇవి తీసుకుంటే కిడ్నీ సమస్యలే రావు.. ఎంతో చక్కగా వర్క్ చేస్తాయి!!
Kidneys
Follow us
Chinni Enni

|

Updated on: Sep 10, 2023 | 4:51 PM

మానవ శరీరంలో ఉన్న విష పదార్థాలను, మలినాలను బయటకు పంపడంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాగే మూత్ర పిండాలు శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తాయి. మూత్ర పిండాలు సరిగ్గా వర్క్ చేయకపోతే.. చాలా నష్టాలు వాటిల్లే ప్రమాదం. మన బాడీలో ప్రతీది ముఖ్యమే. వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాత్రం మనమే వహించాలి. ప్రస్తుతం ఇప్పుడు 100 మందిలో దాదాపు 10 మంది మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. మూత్ర పిండాల సమస్యలు తలెత్తగానే.. వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలు. లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తోంది. వైద్యుల సూచనలు, సలహాలతో పాటు మనం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోడియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి:

మూత్ర పిండాల సమస్యలతో బాధ పడే వారు ఉప్పును తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యం బావుంటుంది. దెబ్బతిన్న మూత్ర పిండాలు ఎక్కువగా ఉన్న సోడియంను బయటకు పంపించలేవు. దీంతో శరీరంలో అధికంగా ఉండే సోడియం వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక రోజూ 2000 మిల్లీ గ్రాముల కంటే తక్కువ మోతాదులో ఉప్పును తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

పొటాషియం ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి:

మూత్ర పిండాల ప్రాబ్లమ్స్ తో బాధ పడేవారు పోటాషియం ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. బంగాళ దుపం, తక్కువ కొవ్వు పాలు, ద్రాక్ష పండ్లు, పుట్ట గొడుగులు, నారింజ, బటానీలు, టమాటాలు, పాలకూర, నేరేడు పండ్లు, అవకాడోలు వంటి వాటిల్లో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.

ఫాస్పరస్ కూడా తక్కువగా తీసుకోవాలి:

కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడే వారు ఫాస్పరస్ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫాస్పరస్ ఉన్న ఆహార పదార్థాలకు వీలైనంత వరకూ దూరంగా ఉంటేనే బెటర్ అని చెప్పవచ్చు.

కిడ్నీ సమస్యలకు క్యాలీ ఫ్లవర్ తో చెక్:

మూత్ర పిండాల సమస్యలతో ఇబ్బంది పడే వారికి క్యాలీ ఫ్లవర్ మంచి ఆహారం. ఇందులో సోడియం, ఫాస్పరస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి.

రెడ్ గ్రేప్స్:

ఎరుపు రంగు గ్రేప్స్ కూడా మూత్ర పిండాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. విటమిన్ సితో పాటు ఫ్లవనాయిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలు దెబ్బతినకుండా చేయడంలో రెడ్ గ్రేప్స్ ఎంతో దోహదపడతాయి.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో ఉండే ఆంథో సైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవడం వల్ల.. కిడ్నీ ఆరోగ్యం దెబ్బ తినకుండా కాపాడడంలో సహాయ పడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి