Akukura Biryani : ఆకు కూరతో బిర్యానీ ఇలా చేయండి.. అద్భుతం అంతే! అస్సలు వదిలి పెట్టరు!!

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు.. చెప్పండి. అందరికీ ఇష్టమే. వద్దు వద్దు అంటూనే మొత్తం లాగించేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడి తింటారు. సాధారణంగా బిర్యానీని మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ లేదా వెజిటేబుల్స్ తో చేస్తారు. నాన్ వెజ్ తినని వాళ్లు వెజిటేబుల్ బిర్యానీ తింటారు. ఇది కూడా బాగానే ఉంటుంది. అయితే బిర్యానీ మరింత హెల్దీగా కావాలంటే ఆకు కూరల బిర్యానీ ట్రై చేయండి. అదేంటి? ఆకు కూరల బిర్యానీ ఏంటని షాక్ అవుతున్నారా. ఇది కూడా రుచిగానే ఉంటుంది. కాకపోతే కాస్త డిఫరెంట్. నాన్ వెజ్, వెజిటేబుల్ బిర్యానీ తిని బోర్ కొట్టిన వాళ్లు..

Akukura Biryani : ఆకు కూరతో బిర్యానీ ఇలా చేయండి.. అద్భుతం అంతే! అస్సలు వదిలి పెట్టరు!!
Akukura Biryani
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2023 | 7:45 AM

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు.. చెప్పండి. అందరికీ ఇష్టమే. వద్దు వద్దు అంటూనే మొత్తం లాగించేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడి తింటారు. సాధారణంగా బిర్యానీని మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ లేదా వెజిటేబుల్స్ తో చేస్తారు. నాన్ వెజ్ తినని వాళ్లు వెజిటేబుల్ బిర్యానీ తింటారు. ఇది కూడా బాగానే ఉంటుంది. అయితే బిర్యానీ మరింత హెల్దీగా కావాలంటే ఆకు కూరల బిర్యానీ ట్రై చేయండి. అదేంటి? ఆకు కూరల బిర్యానీ ఏంటని షాక్ అవుతున్నారా. ఇది కూడా రుచిగానే ఉంటుంది. కాకపోతే కాస్త డిఫరెంట్. నాన్ వెజ్, వెజిటేబుల్ బిర్యానీ తిని బోర్ కొట్టిన వాళ్లు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆకు కూరలే కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఈజీగా.. సింపుల్ గా చేసుకోవచ్చు. మరి ఈ ఆకు కూరల బిర్యానీ ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

బిర్యానీ మసాలా దినుసులు – 10 రూపాయలవి, కడిగి నాన బెట్టుకున్న బాస్మతీ రైస్ – ఒక గ్లాస్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు, పుదీనా, కొత్తి మీర – కొద్దిగా, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – ఒకటి, చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి – 2, సన్నగా తరిగిన టమాటా – ఒకటి, తరిగిన లేత తోటకూర – 2 కట్టలు, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒకటిన్నర స్పూన్, ఉప్పు – రుచికి సరిపడినంత, గరం మసాలా – ఒక స్పూన్, జీడి పప్పు – ఓ గుప్పెడు.

ఇవి కూడా చదవండి

మసాలా పేస్ట్ కి కావాల్సిన పదార్థాలు:

కొత్తిమీర – గుప్పెడు, పుదీనా – గుప్పెడు, వెల్లుల్లి రెబ్బలు – 8, అల్లం – చిన్న ముక్క, పచ్చిమిర్చి – 5, వీటన్నింటినీ మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

ఆకుకూర బిర్యానీ తయారీ విధానం:

మందపాటి ఒక గిన్నె పెట్టుకుని అందులో నూనె లేదా నెయ్యి వేసుకుని వేడి చేయాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి వేగాక కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని మరోసారి ఓ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక.. మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు వేయించాక.. తోట కూర కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, మిగిలిన అన్ని పదార్థాలు వేసి వేయించుకోవాలి.

ఇవన్నీ ఓ రెండు, మూడు నిమిషాలు వేగాక.. రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పుని ఒకసారి రుచి చూశాక.. బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుతూ నీరు అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. నెక్ట్స్ మూత పెట్టి చిన్న మంట మీద మరో 5 నిమిషాలు పాటు మగ్గించుకుని.. జీడి పప్పు, కొత్తి మీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బిర్యానీని ఓ పది నిమిషాల పాటు అలా వదిలేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆకు కూరల బిర్యానీ సిద్ధం. తోట కూర ప్లేస్ లో పాల కూరను కూడా వాడుకోవచ్చు. ఆకు కూరలు తినని వాళ్లు ఇలా బిర్యానీ చేసి పెడితే.. లొట్ట లేసుకుంటూ లాగించేస్తారు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.