AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్మతొక్కల డ్రింక్ తాగండి.. ఎంత లావు పొట్టైనా ఈజీగా కరగాల్సిందే!!

ప్రస్తుత కాలంలో ఎవరిని కదిపినా.. ఒక్కటే సమస్య. అదే అధిక బరువు. జంక్ ఫుడ్ బాగా తినడం.. సమయానికి తినకపోవడం వల్ల అధిక బరువుకు కారణం అవుతున్నారు. దానికి తోడు ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చొని ఉండిపోవడం కూడా మరొక కారణం. కొండల్లా పెరిగిపోతున్న పొట్టల్ని ఈజీ డైట్ తో ఎలా తగ్గించుకోవాలి అని సలహాలు అడుగుతుంటారు. అలాగే వేల వేలకు పోసి మీరీ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. రకరకాల ప్రయత్నాలు చేసి.. అలసిపోయి.. ఇక డైట్ చేయలేక..

నిమ్మతొక్కల డ్రింక్ తాగండి.. ఎంత లావు పొట్టైనా ఈజీగా కరగాల్సిందే!!
Lemon Peel Water
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 11, 2023 | 8:15 AM

Share

ప్రస్తుత కాలంలో ఎవరిని కదిపినా.. ఒక్కటే సమస్య. అదే అధిక బరువు. జంక్ ఫుడ్ బాగా తినడం.. సమయానికి తినకపోవడం వల్ల అధిక బరువుకు కారణం అవుతున్నారు. దానికి తోడు ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చొని ఉండిపోవడం కూడా మరొక కారణం. కొండల్లా పెరిగిపోతున్న పొట్టల్ని ఈజీ డైట్ తో ఎలా తగ్గించుకోవాలి అని సలహాలు అడుగుతుంటారు. అలాగే వేల వేలకు పోసి మీరీ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. రకరకాల ప్రయత్నాలు చేసి.. అలసిపోయి.. ఇక డైట్ చేయలేక.. మళ్లీ షరామామూలుగానే ఆహారం తీసుకుంటారు. శరీర బరువు ఎంత పెరిగితే.. మన ఆరోగ్యం అంత దెబ్బతిన్నట్టే. షుగర్, బీపీ, గుండె జబ్బులు రావడానికి అధిక బరువే ప్రధాన కారణం.

పొట్ట పెరిగితే ఏ పని అంత సులువుగా చేయలేరు. ఎక్కువ దూరం నడవలేరు. మాట్లాడటానికి కూడా ఆయాస పడుతూంటారు. కూర్చోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఎక్కువగా తింటేనే బరువు పెరుగుతారని ఏ వైద్యుడు చెప్పడు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. మనం తీసుకునే ఆహారంలో కొంచెం మాత్రమే శరీరం శక్తి కోసం వాడుకుంటుంది. మిగతా ఆహారం కొవ్ వురూపంలో శరీరంలో పేరుకుపోతుంది. శరీరానికి తగినంత ఆహారం అందకపోవడం వల్ల నీరసంగా ఉన్నట్లు అనిపించడంతో మరింత ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. దానివల్ల పొట్ట పెరుగుతుంది. పొట్ట తగ్గాలంటే జీవక్రియ రేటు పెరగాలి. అలా పెరగాలంటే ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

పొట్టను తగ్గించే ఈ చిట్కా చాలా ఈజీగా చేయొచ్చు. దీనికి కావలసింది కేవలం అల్లం, నిమ్మకాయ మాత్రమే. ఒక గిన్నెలో గ్లాసు నీరు పోసి అందులో నిమ్మరసం, నిమ్మరసం తీసిన నిమ్మ చెక్కలను ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత అల్లం ముక్కల్ని వేసి బాగా మరగనివ్వాలి. ఈ నీటిని వడకట్టి ఒకగ్లాసులోకి తీసుకోవాలి. ఈ డ్రింక్ ను రోజుకు రెండుసార్లు గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఇలా నెల రోజులపాటు తాగితే.. క్రమంగా మీ పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి