AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Vetiver: వట్టివేర్లను ఎలా వాడితే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

వట్టివేర్లు.. వీటినే ఖుస్ అని కూడా అంటారు. వీటి గురించి చాలా మందికి తెలీవు. ఇవి సుగంధ ద్రవ్యాలకు చెందినవే. ఒక రకమైన సువాసనను వెదజల్లుతాయి. మన దేశంలోనే పుట్టిన వట్టివేర్లను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వట్టివేర్లకు మంచి ప్రాముఖ్యత ఉంది. ఒక గడ్డి జాతికి చెందిన మొక్కకు ఉండే వేర్లే ఈ వట్టి వేర్లు. ఆ మొక్కకంటే.. వాటి వేర్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు. వట్టి వేర్లను నానబెట్టిన నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని..

Benefits of Vetiver: వట్టివేర్లను ఎలా వాడితే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
Vetiver
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 11, 2023 | 10:00 AM

Share

వట్టివేర్లు.. వీటినే ఖుస్ అని కూడా అంటారు. వీటి గురించి చాలా మందికి తెలీవు. ఇవి సుగంధ ద్రవ్యాలకు చెందినవే. ఒక రకమైన సువాసనను వెదజల్లుతాయి. మన దేశంలోనే పుట్టిన వట్టివేర్లను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వట్టివేర్లకు మంచి ప్రాముఖ్యత ఉంది. ఒక గడ్డి జాతికి చెందిన మొక్కకు ఉండే వేర్లే ఈ వట్టి వేర్లు. ఆ మొక్కకంటే.. వాటి వేర్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు. వట్టి వేర్లను నానబెట్టిన నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా.

బాడీని కూల్ చేస్తాయి: ఒక మట్టికుండలో నీరుపోసి.. అందులో వట్టివేర్లను వేయాలి. ఒక రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచి.. ఉదయం తాగితే.. ఆ వేర్లలోని గుణాలన్నీ మన శరీరానికి అందుతాయి. వట్టివేర్లు శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. శరీరాన్ని చలువగా ఉంచుతాయి. వట్టివేర్ల నీరు తాగితే.. శరీరంలో అధిక వేడి తగ్గుతుంది.

సూక్ష్మ క్రిములతో పోరాడుతాయి: శరీరంలో ఉన్న విషవ్యర్థాలు, సూక్ష్మ క్రిములతో పోరాడుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంచుతాయి. బ్రెయిన్ కణాలను చల్లబరిచి.. కోపం, ఆవేశాన్ని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

చర్మాన్ని క్లీన్ చేస్తాయి: వట్టివేర్లతో తైలాన్ని కూడా తయారు చేస్తారు. ఈ తైలంలో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. చర్మం, జుట్టుకి వట్టివేర్ల తైలాన్ని వాడుతారు. చర్మాన్ని క్లీన్ చేసేందుకు తైలాన్ని వాడినపుడు మురికి నురుగలా వచ్చి.. బయటికి పోతుంది. వట్టి వేర్ల సరిగ్గా వాడితే స్కిన్ కి సంబంధించి అన్ని రకాల సమస్యలకు బైబై చెప్పేయవచ్చు.

ఆక్సిజన్ లెవల్స్ పెంచుతాయి: మనం వాడే పరుపుల తయారీలోనూ వట్టివేర్లను వాడుతారు. వాడేసిన వట్టివేర్లను సేకరించి.. వాటితో పరుపులను తయారు చేస్తున్నారు. వట్టివేర్లతో తయారు చేసిన పరుపులపై పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.

ఈ వట్టివేర్లు ఎక్కడపడితే అక్కడ లభించవు. ప్రత్యేకంగా ఆయుర్వేదం షాపుల్లో లేదా ప్రముఖ ఈ కామర్స్ సైట్లలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. కానీ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే సహజంగా పని చేస్తాయి కాబట్టి బాడీకి ఎలాంటి హాని చేయవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..