Benefits of Mutton Parts: మటన్ లో ఏయే భాగంలో ఏయే పోషకాలు, విటమిన్లుంటాయో తెలుసా?
నాన్ వెజ్ లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏది అంటే.. చాలా మంది టక్కున చెప్పే సమాధానం చికెన్, చికెన్ బిర్యానీ. కానీ చికెన్ రెగ్యులర్ గా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇప్పుడు మార్కెట్లో లభించే చికెన్ లో 90 శాతం మందుల ద్వారా పెంచినదే. బాయిలర్ చికెన్ కంటే.. నాటుకోడి తినడం ఆరోగ్యానికి మంచిది. కోడి మాంసం కంటే.. మటన్ లోనే ఎక్కువ పోషకాలు, విటమిన్లు ఉంటాయి. చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ.. ఇలా వెరైటీలు ఎన్ని ఉన్నా.. మటన్ బిర్యానీ రుచే వేరు. దానికుండే డిమాండ్ కూడా అలాగే ఉంటుంది మరి. ఒక్కసారి మటన్ వెరైటీస్ టేస్ట్ చేసిన వారెవరైనా.. మళ్లీ తినకుండా ఉండలేరు. ఫంక్షన్లు, పార్టీల్లో మటన్ లేకపోతే..
నాన్ వెజ్ లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏది అంటే.. చాలా మంది టక్కున చెప్పే సమాధానం చికెన్, చికెన్ బిర్యానీ. కానీ చికెన్ రెగ్యులర్ గా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇప్పుడు మార్కెట్లో లభించే చికెన్ లో 90 శాతం మందుల ద్వారా పెంచినదే. బాయిలర్ చికెన్ కంటే.. నాటుకోడి తినడం ఆరోగ్యానికి మంచిది. కోడి మాంసం కంటే.. మటన్ లోనే ఎక్కువ పోషకాలు, విటమిన్లు ఉంటాయి. చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ.. ఇలా వెరైటీలు ఎన్ని ఉన్నా.. మటన్ బిర్యానీ రుచే వేరు. దానికుండే డిమాండ్ కూడా అలాగే ఉంటుంది మరి. ఒక్కసారి మటన్ వెరైటీస్ టేస్ట్ చేసిన వారెవరైనా.. మళ్లీ తినకుండా ఉండలేరు. ఫంక్షన్లు, పార్టీల్లో మటన్ లేకపోతే.. ఆ విందు అసంపూర్ణంగా ఉంటుంది. కానీ.. మటన్ రుచికి తగ్గట్టు.. దాని ధర కూడా కాస్త ఎక్కువే. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.1000 వరకూ పలుకుతుంది. బోన్ లెస్ మటన్ అయితే రూ.1500 వరకూ డిమాండ్ ఉంది. మటన్ లో ఉండే ప్రతి భాగం మన శరీరానికి కావలసిన పోషకాలను కలిగి ఉంటుంది. మరి ఆ పోషకాలు ఏంటో తెలుసుకుందాం.
మటన్ లివర్: మటన్ లివల్ లో ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. వారాంతంలో తినే నాన్ వెజ్ లో మటన్ లివర్ ను కూడా తీసుకుంటే.. రక్త హీనత తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్ చేస్తుంది.
మేక కాళ్లు: మేక కాళ్లను కాల్చి.. తయారు చేసే సూప్ తాగితే.. అంటు వ్యాధులు రాకుండా ఉంటాయి. జలుబు, ఎముకలు విరగడం వంటి సమస్యలున్న వారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇది హిమోగ్లోబిన్ స్థాయిల్ని కూడా పెంచుతుంది. ఎముకలను బలపరుస్తుంది.
మేక తలకాయ: మేక తలకాయలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మేక తలకాయను కాల్చి.. దానిని ముక్కలుగా చేసి కూర వండుకుని చపాతీ, లేదా రైస్ లో తింటుంటారు. రెడ్ మీట్ ఇష్టపడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. తలకాయ కూర తింటే.. శరీరం గట్టిపడుతుంది.
మటన్ బోటీ: మటన్ బోటీ అంటే పేగులు. వీటిలో రకరకాల పోషకాలుంటాయి. మేక ప్రేగుల్లో విటమిన్ ఎ, బి12, డి, ఈ, కె ఉన్నాయి. మటన్ బోటీని కూరగా వండుకుని, లేదా ఫ్రై చేసుకుని తింటే మన ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వారానికి ఒక్కసారి మటన్ తింటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మటన్ వేయించడం, గ్రిల్ చేయడం వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది. సాధారణంగా వండుకుని తింటే ఈ విటమిన్లు, పోషకాలు అందుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి