AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breakfast for Loss Weight: బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఏడు ఫుడ్స్ తినండి చాలు!

అధిక బరువుతో సతమతమవుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. జన్యుపరమైన కారణాలతో కొందరికి ఊబకాయం వస్తుంటే.. చాలా మంది థైరాయిడ్ వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, ఒకే చోట ఎక్కువసేపు కదలిక లేకుండా కూర్చోవడం వల్ల.. అధిక బరువుతో బాధపడుతున్నారు. పెరిగిన బరువుని తగ్గించుకోవడం అంత తేలిక కాదు. ఆహారనియమాలు పాటిస్తూ.. వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఉదయాన్నే తినే అల్పాహారం విషయంలో మరింత జాగ్రత్తగా..

Breakfast for Loss Weight: బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఏడు ఫుడ్స్ తినండి చాలు!
Breakfast
Chinni Enni
|

Updated on: Aug 30, 2023 | 11:24 AM

Share

అధిక బరువుతో సతమతమవుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. జన్యుపరమైన కారణాలతో కొందరికి ఊబకాయం వస్తుంటే.. చాలా మంది థైరాయిడ్ వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, ఒకే చోట ఎక్కువసేపు కదలిక లేకుండా కూర్చోవడం వల్ల.. అధిక బరువుతో బాధపడుతున్నారు. పెరిగిన బరువుని తగ్గించుకోవడం అంత తేలిక కాదు. ఆహారనియమాలు పాటిస్తూ.. వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఉదయాన్నే తినే అల్పాహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉదయం చేసే బ్రేక్ ఫాస్టే మన రోజంతటినీ ప్రభావితం చేస్తుంది. అందుకే పోషకాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది.

ఆకుకూరలు: బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా ఆకుకూరలను తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. స్విస్ చార్డ్, కాలే, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరల్లే క్లరీలు, అధిక పోషకాలు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

నాన్ వెజ్: చికెన్ బ్రెస్ట్, టర్కీ చికెన్, లీన్ బీఫ్, టోఫు, ఫిష్ వంటి ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాలకు బ్రేక్ ఫాస్ట్ లో ప్రాధాన్యమివ్వాలి. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల త్వరగా ఆకలి వేయడం. అతి తిండిని కంట్రోల్ చేస్తూ.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

తృణధాన్యాలు: ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ వంటి తృణ ధాన్యాలను కూడా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే.. ఫైబర్ అందుతుంది. ఆకలి తగ్గి, బరువుని తగ్గించడంలో తోడ్పడుతాయి.

బెర్రీస్: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను అల్పాహారంగా తినాలి, బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీలు, రాస్ బెర్రీలను బ్రేక్ ఫాస్ట్ లో తినాలి. ఇవి అధిక కేలరీలను తీసుకోకుండా నియంత్రిస్తూ.. రుచిని కూడా అందిస్తాయి.

ప్లాంట్ బేస్డ్ ఫుడ్: బీన్స్, కాయ ధాన్యాలు, చిక్ పీస్ వంటి ఫైబర్, ప్రొటీన్ ను అందించే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బ్రేక్ ఫాస్ట్ కు బెస్ట్ ఆప్షన్. ఇవి ఆకలిని నియంత్రించడంలో పాటు ఆరోగ్యకరమైన జీర్ణ క్రియకు సహాయపడుతాయి.

బాదం-చియా సీడ్స్: బాదం, వాల్ నట్, చియా సీడ్స్, అవిసెగింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ప్రొటీన్లు, ఫైబర్ లు సమృద్ధిగా ఉంటాయి. ఆకలిని అరికట్టి.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. గ్రీక్ యోగర్ట్ ను కూడా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే.. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి