Home Remedies To Soothe Canker Sores: అధిక వేడివల్ల నోటిపూత, నోటిలో పొక్కులతో ఇబ్బందిగా ఉందా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!!
శరీరంలో వేడి ఎక్కువైతే.. ఆరోగ్యం పరంగా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. యూరిన్ పచ్చగా వచ్చిందంటే.. శరీరంలో వేడి ఎక్కువగా ఉందని అర్థం. అధిక వేడి వల్ల ఒళ్లు నొప్పులు, కళ్లు మంటలు కలుగుతుంటాయి. నోరు పూయడం వల్ల ఏం తిన్నా కారంగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి నాలుకపై, దవడలలో పుండ్లు ఏర్పడుతాయి. అలాంటపుడు ఏమీ తినే వీలుండదు సరికదా.. కనీసం మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితి ఉంటుంది. మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది. శరీరంలో వేడి కారణంగానే కాదు.. అవసరమైన విటమిన్లు లేకపోవడం, నిర్జలీకరణం, కొన్ని ఆహారాలను తినడం వల్ల కూడా..
శరీరంలో వేడి ఎక్కువైతే.. ఆరోగ్యం పరంగా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. యూరిన్ పచ్చగా వచ్చిందంటే.. శరీరంలో వేడి ఎక్కువగా ఉందని అర్థం. అధిక వేడి వల్ల ఒళ్లు నొప్పులు, కళ్లు మంటలు కలుగుతుంటాయి. నోరు పూయడం వల్ల ఏం తిన్నా కారంగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి నాలుకపై, దవడలలో పుండ్లు ఏర్పడుతాయి. అలాంటపుడు ఏమీ తినే వీలుండదు సరికదా.. కనీసం మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితి ఉంటుంది. మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది. శరీరంలో వేడి కారణంగానే కాదు.. అవసరమైన విటమిన్లు లేకపోవడం, నిర్జలీకరణం, కొన్ని ఆహారాలను తినడం వల్ల కూడా నోటిలో పుండ్లు ఏర్పడటం, నోటిపూత వస్తుంటాయి. వీటిని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.
పసుపు: పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. ఇదొక యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. ఏ గాయాన్నైనా తక్కువసమయంలో మానిపోయేలా చేస్తుంది. నోటిలో పుండ్లు ఉన్నవారు.. కొద్దిగా పసుపులో నీరు కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను నోటిలో పుండ్లపై రాస్తే.. ఒకటి, రెండు రోజుల్లో మానిపోతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్ కూడా గాయాలను వేగంగా నయం చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. నోటిలోని సూక్ష్మక్రిములతో పోరాడుతుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా పుక్కిలించాలి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి ఇలా చేస్తే నోటి పొక్కులు త్వరగా తగ్గుతాయి.
కొబ్బరి పాలు: నోటిలో ఏర్పడిన పుండ్ల వల్ల కలిగే మంట నుంచి కొబ్బరిపాలు ఉపశమనాన్నిస్తాయి. రోజుకి 2-3సార్లు కొబ్బరి పాలతో పుక్కిలిస్తే.. పుండు తీవ్రమైన నొప్పి తగ్గుతుంది.
తేనె: తేనె.. ఇది ఔషధ, యాంటీ మైక్రోబయల్ గుణాలు కలిగి ఉంటుంది. నోటిలో ఉన్న పుండ్లపై తేనె రాసుకుంటే.. అది త్వరగా నయమవుతుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి నోటి అల్సర్లపై తేనెను రాస్తూ ఉండాలి. ఒక్క రోజులోనే నోటిపుండ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. తేనె ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి