Jaggery Tea Reduce Belly Fat: ఈ బెల్లం టీ తాగండి.. బెల్లీ ఫ్యాట్ ని ఈజీగా తగ్గించుకోండి!!
ప్రస్తుతం ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారు. వాకింగ్ లు, జాకింగ్ లు, డైట్ ఫుడ్ అంటూ చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి బెల్లం టీ బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గేందుకు అన్నీ పాటిస్తూనే.. బెల్లం టీ కూడా తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. బెల్లంలో బరువు తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బెల్లం సహజంగానే స్వీట్ కాబట్టి.. ఇది బరువు పెరగకుండా..
ప్రస్తుతం ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారు. వాకింగ్ లు, జాకింగ్ లు, డైట్ ఫుడ్ అంటూ చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి బెల్లం టీ బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గేందుకు అన్నీ పాటిస్తూనే.. బెల్లం టీ కూడా తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. బెల్లంలో బరువు తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బెల్లం సహజంగానే స్వీట్ కాబట్టి.. ఇది బరువు పెరగకుండా చూసుకుంటుంది. మరి ఈ బెల్లం టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం:
బెల్లం టీకి కావాల్సిన పదార్థాలు:
నల్ల మిరియాలు – కొంచెం, దాల్చిన చెక్క – చిన్న ముక్క, అల్లం – 1 అంగుళం, టీ పొడి – ఒక టీస్పూన్, బెల్లం – కొద్దిగా, నీళ్లు – రెండు కప్పులు, తులసి ఆకులు – రెండు, యాలకులు-1
తయారీ విధానం:
ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో యాలకులు, అల్లం, తులసి ఆకులు, దాల్చిన చెక్క వేసి.. ఓ ఐదు నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత నల్ల మిరియాల పొడి, టీ పొడి, బెల్లం మిక్స్ వేసి కలపాలి. దీన్ని కొంచెం సేపు మరగనిచ్చి.. దించుకోవాలి. ఆ నెక్ట్స్ ఓ కప్పులో పోసి.. బెల్లం టీని తాగడమే. సింపుల్ గా ఉన్నా కూడా దీని బెనిఫిట్స్ మాత్రం సూపర్ గా ఉంటాయి.
బెల్లం టీ ప్రయోజనాలు:
బెల్లంలో మెగ్నిషియం, కాల్షియం, బీ కాంప్లెక్స్, పొటాషియం, విటమిన్ ఇ, సి, బి2 వంటి పోషకాల ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా వ్యాయం చేస్తూ, డైట్ ఫుడ్ మెయింటైన్ చేస్తూ.. ఆహారంలో బెల్లం టీని కూడా యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా బెల్లం టీతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవక్రియను మెరుగు పరుస్తుంది:
బెల్లంలో ఉండే పొటాషియం.. కండరాలను నిర్మించడానికి, జీవక్రియను మెరుగు పరచడానికి సహాయం చేస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే కొవ్వు పేరుకుపోకుండా చూసుకుంటుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యే చేస్తుంది. తద్వారా త్వరగా బరువు తగ్గుతారు.
రక్త హీనతకు చెక్:
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త హీనతను కంట్రోల్ చేస్తుంది. ఐరన్ లోపం కారణంగానే చాలా మంది బరువు పెరుగుతారు. రోజూ చిన్న ముక్క బెల్లం తింటే.. రక్త హీనత నుంచి త్వరగా బయట పడొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి