Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breastfeeding Mothers Foods: పాలు ఇచ్చే తల్లులు ఈ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!!

బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి తల్లీ ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యంపై పడుతుంది. శిశువుకు తల్లిపాలే ఆధారం. ఆరు నెలల వరకు కేవలం తల్లి పాల మీదనే శిశువులు ఆధారపడతారు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. పోషకాలు అందించే ఆహారంతో పాటు అనారోగ్యాలను తెచ్చిపెట్టే ఆహారాలకు కూడా దూరంగా ఉడటం ఉత్తమం. లేదంటే పిల్లలు ఎన్నో సమస్యలు..

Breastfeeding Mothers Foods: పాలు ఇచ్చే తల్లులు ఈ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!!
Breastfeeding mothers
Follow us
Chinni Enni

|

Updated on: Aug 29, 2023 | 4:20 PM

బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి తల్లీ ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యంపై పడుతుంది. శిశువుకు తల్లిపాలే ఆధారం. ఆరు నెలల వరకు కేవలం తల్లి పాల మీదనే శిశువులు ఆధారపడతారు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. పోషకాలు అందించే ఆహారంతో పాటు అనారోగ్యాలను తెచ్చిపెట్టే ఆహారాలకు కూడా దూరంగా ఉడటం ఉత్తమం. లేదంటే పిల్లలు ఎన్నో సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. మరి బిడ్డకు పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ-టీలకు దూరంగా ఉండాలి:

గర్భిణీలుగా ఉన్నప్పుడు, ప్రసవం అయ్యాక కూడా చాలా మంది కాఫీలు తాగుతూనే ఉంటారు. కానీ ఇంత ఇది చాలా ప్రమాదం. బిడ్డకు పాలు ఇచ్చే తల్లులు కెఫీన్ ఉన్న ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. కెఫీన్ కారణంగా పిల్లలకు జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు తరచూ ఏడుస్తూ ఉన్నారంటే మీరు ఎలాంటి ఆహారాన్ని తింటున్నారో ఒక్కసారి చెక్ చేసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

ఈ కాయగూరలకు దూరంగా ఉండాలి:

పాలు ఇచ్చే తల్లులు కాలీ ఫ్లవర్, క్యాబేజీ, దోసకాయ, బ్రొకలీ వంటి వాటికి దూరంగా ఉండటమే బెటర్. అలాగే దాల్చిన చెక్క, మిరియాలు వేసిన ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. ఇవన్నీ పిల్లల్లో గ్యాస్ట్రిక్, అరుగుదల సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. విరేచనాలు కావడం వంటివి కూడా జరగొచ్చు. కాబట్టి పిల్లలు పాలు మానేసే వరకు ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

పుదీనా:

మీ పిల్లలు కేవలం మీ పాలన మీదనే ఆధారపడి ఉంటే కనుకు మీరు పుదీనాకు చాలా దూరంగా ఉంటే మంచిది. ఇది పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి పాలు మానిపించే వరకు పుదీనాకు దూరంగా ఉండాలి.

ఈ ఆహారాలను తినండి:

చికెన్, మటన్, బీట్ రూట్, క్యారెట్, ఆకు కూరలు, గుడ్లు, పాలు వంటి ఆహారాలు బిడ్డ ఎదుగుదలకు చాలా సహకరిస్తాయి. పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. మితంగా తింటే బిడ్డకు, తల్లికి ఇద్దరికీ ఆరోగ్యకరం. అలాగే నువ్వుల నూనెతో వండిన వంటకాలు తింటే బిడ్డకు రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి