Moringa Leaves Benefits: మునగ ఆకుతో ఒక నెలలోనే ఒత్తైన జుట్టు మీ సొంతం.. మరిన్నో బెనిఫిట్స్!!
చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జుట్టు అతిగా రాలుతూ ఉంటుంది. జుట్టు రాలడానికి అడ్డుకట్ట వేస్తే.. మిగిలిన సమస్యలు కూడా సర్దుకుంటాయి. ఆడువారికి ముఖ్యంగా జుట్టుతోనే మరింత అందం యాడ్ అవుతుంది. జుట్టుకు మేలు చేసే వాటిల్లో మునకాకు ఒకటి. మునగాకు నుంచి తయారు చేసిన ఆయిల్ జుట్టుకు చాలా మేలు చేస్తుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మరి మునగాకును ఎలా వాడితే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు..
ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ బిజీ రోజుల కారణంగా ఏదైనా వెంటనే అయిపోవాలి. కారణం సమయం లేకపోవడం. గంటల్లోనే.. రోజుల్లోనే రిజల్ట్ కోసం ఎదురు చూస్తూంటారు. అయితే అలా తొందరగా అయ్యే వాటిల్లో పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ నే ఎక్కువగా ఉంటుంది. ఈ బిజీ లైఫ్ కారణంగా.. ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా.. శరీరానికి రెస్ట్ ఇవ్వకుండా పనుల్లో నిమగ్నమైపోతున్నారు. అనంతరం జబ్బుల బారిన పడుతున్నారు. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. దీంతో ఆస్పత్రలు వెంట తిరిగి తిరిగి.. మందు బిళ్లలను మింగుతున్నారు. కాస్త సమయాన్ని వెచ్చిస్తే ఇంట్లో ఉండే కొన్ని రకాల పద్దతులతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండదు.
ఇప్పుడు చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జుట్టు అతిగా రాలుతూ ఉంటుంది. జుట్టు రాలడానికి అడ్డుకట్ట వేస్తే.. మిగిలిన సమస్యలు కూడా సర్దుకుంటాయి. ఆడువారికి ముఖ్యంగా జుట్టుతోనే మరింత అందం యాడ్ అవుతుంది. జుట్టుకు మేలు చేసే వాటిల్లో మునకాకు ఒకటి. మునగాకు నుంచి తయారు చేసిన ఆయిల్ జుట్టుకు చాలా మేలు చేస్తుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మరి మునగాకును ఎలా వాడితే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగ ఆకుతో హెయిర్ ప్యాక్:
ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి రెండు చెంచాల మునగ ఆకు పౌడర్ కి, రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను కలపండి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. గంటసేపు తర్వాత షాంపూతో తలస్నానం చేయడం. ఇలా వారానికి ఒక్కసారైనా ఈ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు రాలడం తగ్గిపోవడమే కాకుండా ఒత్తుగా నిగనిగలాడుతూ ఉంటుంది.
మునగ ఆకు ఆయిల్:
బాదం నూనె లేదా కొబ్బరి నూనెను తీసుకోండి. దానితో 2 – 3 చుక్కల మునక విత్తన నూనెను కలపండి. రెండింటిని బాగా కలిపి తలకు రాసుకోవాలి. ఆ తర్వాత ఓ ఐదు నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా ఓ అరగంట సేపు ఉంచి షాంపూతో కడిగేసుకోవడమే.
-మునగ ఆకులు జట్టు పెరుగుదలకు సహాయపడతాయి -ఈ ఆకుల్లో ఉంటే విటమిన్ సి.. మీ తలకు చాలా మేలు చేస్తుంది. ఈ విటమిన్ కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. అలాగే జుట్టు మూలాలను బలపరుస్తుంది. -ఇది ఒమేగా-త్రీ ఫ్యాటీ యాసిడ్ లను కలిగి ఉంటుంది. అలాగే జుట్టుకు సహజంగా తేమను అందిస్తుంది. -మునగ ఆకుల్లో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టు కనాలను బలపరుస్తుంది. కాబట్టి జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి