Black Raisins Soaked in Curd Benefits: పెరుగులో కిస్మిస్ లను నానబెట్టి తినండి.. ఈజీగా రోగ నిరోధక శక్తిని పెంచుకోండి!!
నల్లఎండు ద్రాక్షలు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా వీటి గురించి పరిచయాలు అవసరం లేదు. వీటికి ఎక్కువగా కేకులు, ఖీర్, బర్ఫీలలో ఎక్కువగా వాడుతూంటారు. రాత్రాంతా నానబెట్టి తింటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వీటితో బరువు, కొలెస్ట్రాల్, బీపీని కంట్రోల్ లోకి తీసుకురావచ్చు. నల్ల ఎండుద్రాక్ష వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మనకు సూపర్ మార్కెట్స్ లో, డ్రై ఫ్రూట్ షాపుల్లో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. చాలా మంది వీటిని నేరుగా కూడా తింటారు. ఎలా తీసుకున్నా కూడా ఎండు ద్రాక్షలు మనకు మేలు..
నల్లఎండు ద్రాక్షలు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా వీటి గురించి పరిచయాలు అవసరం లేదు. వీటికి ఎక్కువగా కేకులు, ఖీర్, బర్ఫీలలో ఎక్కువగా వాడుతూంటారు. రాత్రాంతా నానబెట్టి తింటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వీటితో బరువు, కొలెస్ట్రాల్, బీపీని కంట్రోల్ లోకి తీసుకురావచ్చు. నల్ల ఎండుద్రాక్ష వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మనకు సూపర్ మార్కెట్స్ లో, డ్రై ఫ్రూట్ షాపుల్లో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. చాలా మంది వీటిని నేరుగా కూడా తింటారు. ఎలా తీసుకున్నా కూడా ఎండు ద్రాక్షలు మనకు మేలు చేస్తాయి. అందులోనూ వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం మీకు తెలుసా. మరి వీటిని ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకుంటే ఎలాంటి ప్రయోజానలు కలుగుతాయో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ప్రతిరోజూ 5 లేదా 6 ఎండు ద్రాక్షలను ఒక కప్పు పెరుగులో ఒక గంట పాటు నానబెట్టి తీసుకుంటే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఇవి రెండూ హెల్ప్ చేస్తాయి.
రక్త ప్రసరణ మెరుగు పడుతుంది: ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్త హీనత సమస్య కూడా ఉండదు.
కీళ్ల నొప్పులు చెక్: కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఎండు ద్రాక్షను పెరుగులో నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఎముకలు బలంగా: వీటిని తరుచూ తీసుకోవడం వల్ల క్యాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు ధృడంగా తయారవుతాయి. అలాగే ఎములకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా దంతాలు కూడా ధృడంగా ఉంటాయి.
జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది: పెరుగు, ఎండు ద్రాక్షలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపులో మంట, మలబద్ధకం సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కంటి చూపు బాగుంటుంది: పెరుగు, ఎండు ద్రాక్షలను నానబెట్టి తీసుకోవడం ద్వారా కంటి చూపు మెరుగు పడుతుంది. వృద్ధ్యాప్యంలో కూడా చక్కగా కనిపిస్తాయి.
క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవు: వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.
బరువు తగ్గొచ్చు: ఈ రెండింటి కాంబినేషన్ తింటే సులభంగా బరువు కూడా తగ్గొచ్చు. ఎందుకంటే ఇది తింటే పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. త్వరగా ఆకలి కూడా వేయదు.
కాగా దీన్ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం స్నాక్ రూపంలో కూడా తీసుకుంటే బెటర్.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి