AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ultra-Processed Food Side effects: ప్రాసెస్ చేసిన ఫుడ్ తింటున్నారా.. అయితే మీకు ఈ జబ్బులు ఖచ్చితంగా వస్తాయి!!

ప్రస్తుతం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఏది అందుబాటులో వెంటనే రెడీగా ఉంటే అదే తీసుకుంటున్నాం. కారణం సరైన సమయం లేకపోవడం. ఉదయం టిఫిన్ మొదలు.. రాత్రి భోజనం వరకూ చాలా మంది ప్రోసెస్డ్ ఫుడ్ మీదనే ఆధారపడి బతికేస్తున్నారు. ఫిజీ డ్రింక్స్, పలు రకాల స్నాక్స్, ప్యాక్ చేసిన చిరుతిళ్లు, స్వీట్స్, బటర్, ప్రాజెస్ట్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, రెడీ టూ మీల్స్ ఇలా దొరికిన ఆహారంతోనే సరిపెట్టుకుంటున్నారు. పల్లెటూర్లలో తప్పితే.. సిటీల్లో, నగరాల్లో స్వయంగా వండుకుని తినేవారు చాలా తక్కువ. అలాగే బాడీకి సరైన రెస్ట్ కూడా ఇవ్వకపోవడంతో.. ఊబకాయం, అధిక బరువు,..

Ultra-Processed Food Side effects: ప్రాసెస్ చేసిన ఫుడ్ తింటున్నారా.. అయితే మీకు ఈ జబ్బులు ఖచ్చితంగా వస్తాయి!!
Ultra-Processed Food
Chinni Enni
|

Updated on: Aug 28, 2023 | 10:17 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఏది అందుబాటులో వెంటనే రెడీగా ఉంటే అదే తీసుకుంటున్నాం. కారణం సరైన సమయం లేకపోవడం. ఉదయం టిఫిన్ మొదలు.. రాత్రి భోజనం వరకూ చాలా మంది ప్రోసెస్డ్ ఫుడ్ మీదనే ఆధారపడి బతికేస్తున్నారు. ఫిజీ డ్రింక్స్, పలు రకాల స్నాక్స్, ప్యాక్ చేసిన చిరుతిళ్లు, స్వీట్స్, బటర్, ప్రాజెస్ట్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, రెడీ టూ మీల్స్ ఇలా దొరికిన ఆహారంతోనే సరిపెట్టుకుంటున్నారు. పల్లెటూర్లలో తప్పితే.. సిటీల్లో, నగరాల్లో స్వయంగా వండుకుని తినేవారు చాలా తక్కువ. అలాగే బాడీకి సరైన రెస్ట్ కూడా ఇవ్వకపోవడంతో.. ఊబకాయం, అధిక బరువు, గుండె జబ్బులు, షుగర్, బీపీ, క్యాన్సర్ లు వంటి పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడంపై తాజాగా రెండు అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల్లో పలు ఆసక్తికర నిజాలు వెలుగుచూశాయి.

మొదటి అధ్యయనం 15 సంవత్సరాల పాటు 10 వేల మంది మహిళలపై జరిపిన పరిశోధనల్లో ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల వారు రక్తపోటు, గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధి వంటి సమస్యల బారిన పడినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. చైనాలో జరిపిన రెండో అధ్యయనం 3,25,000 కంటే ఎక్కువ మందిపై జరిపిన పరిశోధనలో ప్రాసెస్ చేసిన ఫుడ్ తినేవారిలో పురుషులు, స్త్రీలు గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఇంకా పలు వ్యాధులకు గురైనట్లు పేర్కొన్నారు.

ఆమ్ స్టర్ డామ్ లోని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సమావేశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్కడ వేలాది మంది ప్రముఖ గుండె శాస్త్రవేత్తలు, వైద్యులు ఈ వివరాలను వివరించారు. తాజా పండ్లు, కూరగాయలు, బ్రెడ్, ఇంట్లో తయారు చేసిన వంటలు తినేవారిలో కంటే ప్రాసెస్ చేసిన ఫుడ్ తినేవారిలో ఈ గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ముసలితనం, మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్ ఫ్లమేటరీ బాల్ సిండ్రోమ్, స్థూలకాయం, టైమ్2 మధుమేహం, క్యాన్సర్ సహా అనేక రకాల అనారోగ్య సమస్యలు అల్ట్రా ప్రాసెస్ చేయడబడి ఫుడ్ తినడం వల్ల వస్తున్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

మీరు తక్కువలో తక్కువగా ప్రతి రోజూ 50 గ్రాముల ప్రాసెస్ ఫుడ్ తిన్నా కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 18 శాతం పెరుగుతుంది. అంతే కాకుండా ప్రాసెస్డ్ ఫఉడ్ లో ఉండే కృత్రిమ చక్కెర ఖచ్చితంగా ఉబకాయం సమస్యను పెంచుతుంది. వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులను కూడా తెచ్చిపెట్టుకున్నట్టే. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా ఫ్రక్టోజ్, గ్లూకోజ్, కార్న్ సిరప్ వంటి వాటిని ఎక్కువగా వాడుతూంటారు. వీటిని రోజువారీ ఆహారంలో 10 శాతానికి మించి తీసున్నా.. శరీరానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి