- Telugu News Photo Gallery Oregano Oil is a natural remedy to all these health benefits, check to know
Oregano Oil: ఒరెగానో నూనెతో గుండెకు రక్షణ.. ఉపయోగించారంటే క్యాన్సర్, కొలెస్ట్రాల్ పరార్..!
Oregano Oil: ఒరెగానో ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని అద్భుత ఔషధ గుణాలు చక్కని సువాసనతో పాటు.. ఆరోగ్య సమస్యలను దూరం చేయడల శక్తిని కలిగి ఉంటాయి. అందుకే ఒరెగానో నూనెను శక్తివంతమైనది చెప్పుకుంటారు. ఇక ఈ నూనెలోని విటమిన్లు, మినరల్స్, ఇతర లక్షణాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Aug 28, 2023 | 9:32 PM

గుండె ఆరోగ్యం: ఒరేగానో ఆయిల్‌లోని థైమోల్, కార్వాక్రోల్ అనే పాలీఫెనాల్స్ మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ని తొలగిస్తాయి. ఫలితంగా గుండెపోటు, రక్తపోటు ప్రమాదం తగ్గడంలో పాటు బరువు తగ్గుతారు.

క్యాన్సర్‌ను నిరోధిని: ముందుగా చెప్పుకున్నట్లుగా ఒరెగానో అయిల్‌లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి పెద్దపేగు, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్‌ని నిరోధిస్తాయి. ఇంకా క్యాన్సర్ కణితిని విచ్చిన్నం చేస్తాయి.

ఇన్ఫెక్షన్లకు చెక్: ఒరెగానో నూనెలోని యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టగలవు. గోళ్లు, పళ్లు, గాయాల మీద వచ్చే సమస్యలకు పరిష్కారంగా ఒరెగానో నూనెను ఉపయోగించవచ్చు.

పేగుల ఆరోగ్యం: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ గుణాలను కలిగిగన ఒరెగానో నూనె కడుపులోని పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫలితంగా కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.

నొప్పి నుంచి ఉపశమనం: కీళ్ల నొప్పులకు ఒరెగానో ఆయిల్ చక్కని పరిష్కారం. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అన్ని రకాల నొప్పులను తగ్గిస్తాయి.

గమనిక: పై సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.





























