అయితే రానురాను మట్టి కుండల స్థానంలో ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫ్రిజ్‌లను వాడుతుండటంతో తాము తయారు చేసిన మట్టికుండలను కొనేవారు లేకుండా పోయారని వాపోతున్నారు. సామాన్య ప్రజలు గతంలో మట్టి కుండలలోనూ, కూజాలలోనూ నీటిని నిల్వ చేసుకునితాగేవారు. మట్టికుండలను పేదల ప్రిజ్ అని కూడా పేర్కొనేవారు. కానీ ఇప్పుడు ఫ్రిజ్‌లు, కూల్ క్యాన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో మట్టి కుండల వినియోగం తగ్గిపోయింది. దీపావళి వచ్చిందంటే ఇంటి ముంగిట వరుసగా మట్టి ప్రమిదలు పేర్చి నూనె దీపాలు వెలిగించే వారు. క్రమేణా కొవ్వొత్తులు, విద్యుద్దీపాలతో అలంకరణ చేస్తుండడంతో మట్టి ప్రమీదల ప్రాధాన్యత తగ్గిపోయింది.