Vitamin-E Capsules for Skin: చర్మ సౌందర్యానికి విటమిన్ -ఈ కాప్యూల్స్ ను ఇలా వాడండి.. ఆ సమస్యలన్నింటికి చెక్ పెట్టండి!!

అందం ఎవరి సొంతమూ కాదు. అందంగా కనిపించాలని, నలుగురి దృష్టి తమపైనే ఉండాలని ఆడవారితో పాటు.. మగవారు కూడా కోరుకుంటారు. అందాన్ని పెంచుకునేందుకు మార్కెట్లలో వచ్చే రకరకాల బ్యూటీ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయితే వాటిని వాడటం అంతమంచిది కాదు సరికదా. ఒక్కోసారి ఊహించని సమస్యలను కూడా తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా ముఖంపై వాడే క్రీమ్ లు, మేకప్ ప్రొడక్ట్స్ కారణంగా గుంటలు పడుతుంటాయి. ముఖ సౌందర్యాన్ని కాపాడటంలో..

Vitamin-E Capsules for Skin: చర్మ సౌందర్యానికి విటమిన్ -ఈ కాప్యూల్స్ ను ఇలా వాడండి.. ఆ సమస్యలన్నింటికి చెక్ పెట్టండి!!
Beauty Skin
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 10, 2023 | 6:28 PM

అందం ఎవరి సొంతమూ కాదు. అందంగా కనిపించాలని, నలుగురి దృష్టి తమపైనే ఉండాలని ఆడవారితో పాటు.. మగవారు కూడా కోరుకుంటారు. అందాన్ని పెంచుకునేందుకు మార్కెట్లలో వచ్చే రకరకాల బ్యూటీ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయితే వాటిని వాడటం అంతమంచిది కాదు సరికదా. ఒక్కోసారి ఊహించని సమస్యలను కూడా తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా ముఖంపై వాడే క్రీమ్ లు, మేకప్ ప్రొడక్ట్స్ కారణంగా గుంటలు పడుతుంటాయి. ముఖ సౌందర్యాన్ని కాపాడటంలో విటమిన్ -E క్యాప్సూల్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది.

విటమిన్ -E క్యాప్సూల్ అన్ని మెడికల్ షాపుల్లోనూ మనకు లభిస్తుంది. ధర కూడా తక్కువే. విటమిన్ -E క్యాప్సూల్ ను రెగ్యులర్ గా వాడటం వల్ల మీ ముఖం మరింత అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మాన్ని రక్షించడంతో పాటు పోషకాలను కూడా అందిస్తుంది విటమిన్ -E క్యాప్సూల్. మరి ఈ క్యాప్సూల్స్ ని ఎలా వాడాలి? ఎలా వాడితే మనకు బెనిఫిట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మృత కణాలను తొలగిస్తుంది: మీ ముఖంపై మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలు ఉంటే.. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు విటమిన్ -E క్యాప్సూల్ లోని జెల్ ను తీసి ఆ మచ్చలపై రాయాలి. ఇలా అవి తగ్గేంతవరకూ ఉపయోగించాలి. విటమిన్ -E క్యాప్సూల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలను పోగొట్టి.. మృతకణాలను తొలగిస్తాయి.

ఇవి కూడా చదవండి

డార్క్ సర్కిల్స్: కంటి కింద నల్లటి వలయాలు, నల్ల మచ్చలు ఉన్నవారు కూడా విటమిన్ -E క్యాప్సూల్ లో జెల్ ను రాత్రి పడుకునే ముందు రాసుకుని.. స్లో గా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోయి.. ముఖం మెరుస్తుంది.

నల్ల మచ్చలు పోతాయి: 2 టేబుల్ స్పూన్ల పుల్లని పెరుగులో.. కొద్దిగా నిమ్మరసం, విటమిన్ -E క్యాప్సూల్ జెల్ ను వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు విటమిన్ -E క్యాప్సూల్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే నల్ల మచ్చలు పోయి.. ముఖం మెరుస్తుంది.

డ్రై స్కిన్ ఉండదు: మీది డ్రై స్కిన్ అయితే.. 1 స్పూన్ తేనెలో 2 చెంచాల పాలు, రెండు విటమిన్ -E క్యాప్సూల్ జెల్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, చేతులకు రాసుకోవాలి. పావుగంట (15 నిమిషాలు) తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే.. మంచి ఫలితాలుంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి