AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nerve Burning: మీ చేతులు, పాదాల నరాల్లో మంటలు వస్తున్నాయా.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి!!

చాలా మందికి పాదాల్లో, చేతుల్లో మంటలు వస్తూంటాయి. దీన్నే అరికాల్లో మంటలు అంటారు. ఒక్కోసారి ఈ మంటలు, నొప్పులు రోజంతా ఉంటాయి. దీన్నే పెరిఫిరల్ న్యూరోపతి అని కూడా అంటారు. వేడి చేసిందని.. అందుకే మంటలు వస్తాయి అనుకుంటారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారి తీస్తుంది. ఈ సమస్య కారణంగా పని చేయడానికి, నడవడానికి చాలా ఇబ్బంది పడుతూంటారు. నడిచేటప్పుడు విపరీతమైన బాధ, నొప్పి వస్తాయి. పాదాల్లో, అరి చేతుల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. మన శరీరంలో నరాలపై ఒక కవచం ఉంటుంది. ఈ కవచం దెబ్బ తినడం వల్ల ఇలా..

Nerve Burning: మీ చేతులు, పాదాల నరాల్లో మంటలు వస్తున్నాయా.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి!!
Burning In Feet And Hands
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 10, 2023 | 6:30 PM

Share

చాలా మందికి పాదాల్లో, చేతుల్లో మంటలు వస్తూంటాయి. దీన్నే అరికాల్లో మంటలు అంటారు. ఒక్కోసారి ఈ మంటలు, నొప్పులు రోజంతా ఉంటాయి. దీన్నే పెరిఫిరల్ న్యూరోపతి అని కూడా అంటారు. వేడి చేసిందని.. అందుకే మంటలు వస్తాయి అనుకుంటారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారి తీస్తుంది. ఈ సమస్య కారణంగా పని చేయడానికి, నడవడానికి చాలా ఇబ్బంది పడుతూంటారు. నడిచేటప్పుడు విపరీతమైన బాధ, నొప్పి వస్తాయి. పాదాల్లో, అరి చేతుల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. మన శరీరంలో నరాలపై ఒక కవచం ఉంటుంది. ఈ కవచం దెబ్బ తినడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా నరాలు దెబ్బతినడానికి వివిధ కారణాలు ఉంటాయి.

డయాబెటీస్: షుగర్ కారణంగా కూడా పాదాలు, చేతుల్లో మంటలు వస్తూంటాయి. రక్తంలో ఉండే చక్కెర నరాల కణాలకు సరిగ్గా అందకపోవడం వల్ల అలాగే నరాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పోవడం వల్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో మంటలు వస్తూంటాయి.

విటమిన్ బీ12 లోపం కారణంగా: శరీరంలో విటమిన్ బీ12 లోపించడం కారణంగా కూడా నరాలు దెబ్బతింటాయి. నరాలపై ఉండే కవచం తయారవ్వాలంటే మనకు విటమిన్ బీ12 అవసరమవుతుంది. ఈ విటమిన్ లోపించడం కారణంగా నరాలపై కవచం సరిగ్గా తయారవ్వక నరాలు దెబ్బతింటాయి. అదే విధంగా సయాటికా నరం ఒత్తిడికి గురి అవ్వడం వల్ల కూడా అరికాళ్లల్లో, అరి చేతుల్లో మంటలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

రక్తం తక్కువగా ఉంటే: శరీరంలో రక్తం తక్కువగా ఉండడం వల్ల కూడా మంటలు వస్తాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉండడం వల్ల పాదాలకు, చేతులకు రక్త ప్రసరణ సాఫీగా సాగక పాదాల్లో మంటలు వస్తాయి. అలాగే హెచ్ఐవీ ఉన్నా కూడా అలానే వస్తాయి.

క్యాన్సర్: అదే విధంగా క్యాన్సర్ తో బాధపడే వారు కీమో థెరపీ చేయించుకుంటారు. కీమో థెరపీ ప్రభావం వల్ల కూడా నరాలు దెబ్బతిని మంటలు వస్తూ ఉంటాయి.

మూత్ర పిండాల సమస్యలు: మూత్ర పిండాల సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. మూత్ర పిండాల్లో వైఫల్యం, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నప్పుడు కూడా నారాల్లో మంటలు వస్తూ ఉంటాయి.

ఇలా ఫంగల్ ఇన్ ఫెక్షన్, ఇన్ ప్లామేషన్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా నరాలు దెబ్బతిని మంటలు వస్తాయి. పాదాల్లో, చేతుల్లో మంటలతో బాధపడేవారు వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలు. అలాగే ఈ మంటలతో బాధ పడేవారు నార్మల్ చెప్పులకు బదులు.. ఆర్థో చెప్పులను వాడాలి. అలాగే ప్రతి రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు పాదాలను చల్లటి నీటిలో ఉంచుతూ ఉండాలి. పడుకునేటప్పుడు పాదాల కింద దిండును పెట్టుకుని నిద్రించాలి. అలాగే కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి