AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: డిటర్జెంట్-ఉప్పు కలిపి వాడితే.. మీ వంట గది తళతళమని మెరవాల్సిందే!!

చిన్న చిన్న చిట్కాలతో మన కిచెన్ ను ఎంతో అందంగా దిద్దుకోవచ్చు. అలాగే చిన్న టిప్స్ తో మన ఆరోగ్యాలను కూడా కపాడుకోవచ్చు. వంట చేసే ఇల్లాలు చేతిలోనే అందరి ఆరోగ్యం దాగి ఉంది. అలాగే ఇంటిని కూడా అందంగా మార్చుకోవడంలో ఇల్లాలి పాత్ర ముఖ్యం. ఇంట్లో ఉన్నా కూడా ఖాళీ లేకుండా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. దానికి తోడు ఇంట్లో పిల్లలు ఉంటే అది డబుల్ అవుతుంది. వేరే పనిలో పడి అప్పుడప్పుడు పొయ్యి మీద కూరలు, పాలు, టీ పెట్టి మర్చిపోతూ ఉంటాం. అవి కాస్తా మాడిపోతాయి. వదలనే వదలవు. వాటితో గుంజీలు తియ్యలేక..

Kitchen Hacks: డిటర్జెంట్-ఉప్పు కలిపి వాడితే.. మీ వంట గది తళతళమని మెరవాల్సిందే!!
Kitchen Hacks
Chinni Enni
|

Updated on: Aug 27, 2023 | 5:52 PM

Share

చిన్న చిన్న చిట్కాలతో మన కిచెన్ ను ఎంతో అందంగా దిద్దుకోవచ్చు. అలాగే చిన్న టిప్స్ తో మన ఆరోగ్యాలను కూడా కపాడుకోవచ్చు. వంట చేసే ఇల్లాలు చేతిలోనే అందరి ఆరోగ్యం దాగి ఉంది. అలాగే ఇంటిని కూడా అందంగా మార్చుకోవడంలో ఇల్లాలి పాత్ర ముఖ్యం. ఇంట్లో ఉన్నా కూడా ఖాళీ లేకుండా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. దానికి తోడు ఇంట్లో పిల్లలు ఉంటే అది డబుల్ అవుతుంది. వేరే పనిలో పడి అప్పుడప్పుడు పొయ్యి మీద కూరలు, పాలు, టీ పెట్టి మర్చిపోతూ ఉంటాం. అవి కాస్తా మాడిపోతాయి. వదలనే వదలవు. వాటితో గుంజీలు తియ్యలేక పక్కన పడేస్తాం. నూనె మరకలు కూడా అంతే. ఇలాంటి వాటిని ఈజీగా తొలగించుకోవాలంటే.. ఈ చిట్కాను వాడండి. అంతే వంట పాత్రలు, మురికి పట్టిన గోడలు తళతళమని మెరిసిపోతాయి.

ఈ లిక్విడ్ ని ఎలా తయారు చేసుకోవాలంటే:

దీని కోసం ఒక గిన్నెలో లిక్విడ్ డిజర్జెంట్ ఒక కప్పు, ఒక కప్పు నీళ్లను పోయాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును, ఒక టేబుల్ స్పూన్ వంట సోడాను కలపాలి. ఈ విశ్రమాన్ని ఒక డబ్బాలో పోసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న విశ్రమంతో గిన్నెలను శుభ్రం చేయడం వల్ల గిన్నెలపై ఉండే మరకలన్నీ ఈజీగా తొలగిపోతాయి. గిన్నెలు కొత్తవాటి వలే తయారవుతాయి. ఈ లిక్విడ్ తో నూనె మరకలు, సింక్, స్టవ్ ను కూడా శుభ్రం చేసుకోవచ్చు. కాస్త లిక్విడ్ ను వాటిపై వేసి ఓ ఐదు నిమిషాలు వదిలేసి.. ఆ తర్వాత శుభ్రం చేస్తే ఈజీగా ఆ మురికి అంతా పోతుంది.

ఇవి కూడా చదవండి

సింక్ లో ఉండే మురికి, జిడ్డు, నీటి మరకలు తొలగిపోయి సింక్ కొత్తగా తయారవుతుంది. అలాగే ఈ లిక్విడ్ తో టాయిలెట్ ను కూడా శుభ్రం చేసుకోవచ్చు. డిటర్జెంట్-ఉప్పు కలిపిన లిక్విడ్ ను ఉపయోగించడం వల్ల టాయిలెట్ పై ఉండే పసుపు మరకలు తొలగిపోయి టాయిలెట్ తెల్లగా వస్తుంది. ఈ విధంగా మనకు సులభంగా లభించే వాటితోనే లిక్విడ్ ను తయారు చేసుకుని ఉపయోగించడం వల్ల అధిక శ్రమను తప్పించుకోవచ్చు. అలాగే మనం పని కూడా సులభంగా అయిపోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..