Rice Rasgulla: అన్నం మిగిలితే పడేస్తున్నారా.. ఇలా టేస్టీ రసగుల్లా చేసుకోవచ్చు!!
చాలా మందికి తీపి తినడం అంటే చాలా ఇష్టం. ఏదో రూపంలో కాస్త తీపి నోట్లోకి వెళ్లాల్సిందే. స్వీట్లు కనిపించాయంటే నోట్లో వేసుకోకుండా ఆగలేరు. అందులో రసగుల్లా ఒకటి. రసగుల్లను నోట్లో ఇలా వేసుకోగానే.. అలా కరిగిపోతుంది. ఇవి ఎంతో సాఫ్ట్ గా, టేస్టీగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టం తింటారు. సాధారణంగా రసగుల్లాను పాలతో తయారు చేస్తూంటారు. కానీ అన్నంతో కూడా చేయొచ్చని మీకు తెలుసా? ఏంటి అని నోరెళ్ల బెట్టారా.. నిజమే. మనకు ఎప్పుడైనా రసగుల్లా తినాలనిపించినప్పుడు.. స్వీట్ షాపుకు వెళ్లి తెచ్చుకోకుండా.. మనమే ఈజీగా ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో..
చాలా మందికి తీపి తినడం అంటే చాలా ఇష్టం. ఏదో రూపంలో కాస్త తీపి నోట్లోకి వెళ్లాల్సిందే. స్వీట్లు కనిపించాయంటే నోట్లో వేసుకోకుండా ఆగలేరు. అందులో రసగుల్లా ఒకటి. రసగుల్లను నోట్లో ఇలా వేసుకోగానే.. అలా కరిగిపోతుంది. ఇవి ఎంతో సాఫ్ట్ గా, టేస్టీగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టం తింటారు. సాధారణంగా రసగుల్లాను పాలతో తయారు చేస్తూంటారు. కానీ అన్నంతో కూడా చేయొచ్చని మీకు తెలుసా? ఏంటి అని నోరెళ్ల బెట్టారా.. నిజమే. మనకు ఎప్పుడైనా రసగుల్లా తినాలనిపించినప్పుడు.. స్వీట్ షాపుకు వెళ్లి తెచ్చుకోకుండా.. మనమే ఈజీగా ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో వీటిని తయారు చేసుకోవచ్చు. దీని కోసం పెద్దగా కష్ట పడాల్సిన పని కూడా లేదు. చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా చేసుకోవాలి? ఏం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ రసగుల్లా తయారీకి కావాల్సిన పదార్థాలు:
అన్నం – ఒక కప్పు, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, పాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, యాలకుల పొడి – చిటికెడు, కావాలనుకున్నవారు డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకోవచ్చు.
రైస్ రసగుల్లా తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక మిక్సీ జార్ లో అన్నం వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ కు నెయ్యి రాసుకుని అందులో ఈ పేస్ట్ ను వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మైదాపిండి, పాలపొడి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. నెక్ట్స్ చేతులకు నెయ్యి రాసుకుంటూ అంతా చేతితో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రసగుల్లాలుగా నచ్చిన షేపులో చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో పంచదార, నీళ్లు వేసి వేడి చేయాలి. పంచదార పూర్తిగా కరిగిపోయాక.. యాలకుల పొడి వేసి కలపాలి. ఈ సమయంలోనే రసగుల్లాలను కూడా పంచదార పాకంలో వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత గిన్నెలో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే రైస్ రసగుల్లా రెడీ. ఇలా రసగుల్లా తినాలని పించినప్పుడల్లా.. ఇంట్లో ఉండే అన్నంతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి