Kapalbhati Pranayama: కపాలభాతి ప్రాణాయామంతో అదిరే బెనిఫిట్స్.. మీ కోసం వివరంగా!!
యోగాలో అనేక రకాల ఆసనాలున్నాయి. యోగాలోని ఆసనాల గురించి రోజూ తెలుసుకుంటున్నాం. ఒక్కో ఆసనం ఒక్కో వ్యాధిని తగ్గిస్తుంది. అలాగే ప్రాణాయామం కూడా యోగాలో భాగమే. యోగా కొత్తగా మొదలు పెట్టేవారు ప్రాణాయామంతోనే మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాణాయామంలోనూ రకాలున్నాయి. వాటిలో ఒకటి కపాలభాతి ప్రాణాయామం. పేరు వింటే ఎంత కష్టమో అనుకుంటారేమో. కానీ ఇది చేయడం మాత్రం చాలా సులభం. దీనిని ప్రతిరోజూ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనసు తేలిగ్గా, ప్రశాంతంగా..
యోగాలో అనేక రకాల ఆసనాలున్నాయి. యోగాలోని ఆసనాల గురించి రోజూ తెలుసుకుంటున్నాం. ఒక్కో ఆసనం ఒక్కో వ్యాధిని తగ్గిస్తుంది. అలాగే ప్రాణాయామం కూడా యోగాలో భాగమే. యోగా కొత్తగా మొదలు పెట్టేవారు ప్రాణాయామంతోనే మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాణాయామంలోనూ రకాలున్నాయి. వాటిలో ఒకటి కపాలభాతి ప్రాణాయామం. పేరు వింటే ఎంత కష్టమో అనుకుంటారేమో. కానీ ఇది చేయడం మాత్రం చాలా సులభం. దీనిని ప్రతిరోజూ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనసు తేలిగ్గా, ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇంకా దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కింద ఉన్న వివరాలతో మీరు కూడా ఈజీగా కపాలభాతి ప్రాణాయామం చేయండి.. ఆరోగ్యంగా ఉండండి.
కపాలభాతి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
కపాలభాతి చేయడం వల్ల పొట్టదగ్గరున్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఆరోగ్యం విషయానికొస్తే.. షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె పనితీరు ఆరోగ్యంగా జరుగుతుంది.
కపాలభాతి ప్రాణాయామం ఇలా చేయాలి:
మొదట కళ్లుమూసుకుని పద్మాసనంలో కూర్చోవాలి. ముక్కుతో సుదీర్ఘంగా శ్వాస పీల్చుకుని.. ఛాతీని విస్తరించాలి. పొట్ట నుంచి బయటకు గాలిని వేగంగా రెండు నాసికా రంధ్రాల ద్వారా బయటకు పంపాలి. ఇలాగే వేగంగా గాలి పీలుస్తూ, బలంగా వదులుతూ ఉండాలి. ఇలా 30 సార్లు చేయాలి. చివరిగా లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. ఇలా మొత్తం 3 రౌండ్లు చేయాలి. అంటే 90 సార్లు గాలిని పీల్చి వదలాలి. ప్రతి రోజూ ఉదయం లేచిన తర్వాత.. పరగడుపునే ఈ ప్రాణాయామాన్ని చేయాలి.
ముక్కు నుంచి రక్త స్రావం అయ్యే సమస్య ఉన్నవారు, మైగ్రేన్, గుండె పోటు ప్రమాదం, వికారం, రక్తపోటు, తలతిరగడం, హెర్నియా, అల్సర్, ఎపిలెప్సీ వంటి అనారోగ్య సమస్యలున్నవారు కపాలభాతి ప్రాణాయామాన్ని చేయరాదు. ఒకవేళ చేయాలనుకుంటే యోగా నిపుణులను సంప్రదించి, వారి సలహా మేరకు చేయడం ఉత్తమమైనది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి