Ghee Side Effects: మీకు ఈ లక్షణాలున్నాయా? అయితే నెయ్యికి దూరంగా ఉండక తప్పదు!!

నెయ్యి తినడం ఆరోగ్యానికి హానికరమని, బరువు పెరుగుతామని అందరూ అనుకుంటారు. కానీ.. స్వచ్ఛమైన నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం హాని చేయవు. పైగా బరువు తగ్గిస్తాయి. దేశవాళీ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదే. ఆహారం రుచిని కూడా ఇంకా రుచిగా మారుస్తుంది నెయ్యి. ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి. నెయ్యిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. దీనిని తింటే.. చర్మంతో పాటు ఆరోగ్యం..

Ghee Side Effects: మీకు ఈ లక్షణాలున్నాయా? అయితే నెయ్యికి దూరంగా ఉండక తప్పదు!!
Ghee
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 27, 2023 | 8:00 AM

నెయ్యి తినడం ఆరోగ్యానికి హానికరమని, బరువు పెరుగుతామని అందరూ అనుకుంటారు. కానీ.. స్వచ్ఛమైన నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం హాని చేయవు. పైగా బరువు తగ్గిస్తాయి. దేశవాళీ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదే. ఆహారం రుచిని కూడా ఇంకా రుచిగా మారుస్తుంది నెయ్యి. ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి.

నెయ్యిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. దీనిని తింటే.. చర్మంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, ఆర్థరైటిస్, కంటిశుక్లాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఎ, కె, ఇ వంటి అనేక పోషకాలు నెయ్యిలో ఉన్నాయి. దీనిని ఆయుర్వేదంలో ఒక ఔషధంగా పరిగణిస్తారు.

అసిడిటీ ఉన్నవారు దూరంగా ఉండాలి: కొన్ని లక్షణాలు, ఆరోగ్య సమస్యలున్నవారు నెయ్యిని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జీర్ణశక్తి సరిగాలేని వారు నెయ్యికి దూరంగా ఉండాలి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు నెయ్యి తింటే.. ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కాలేయ సమస్యలు ఉన్నవారు: కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా ఆహారంలో నెయ్యి తీసుకోవడం మంచిది కాదు. ఇది ఆరోగ్యానికి విషంలా పనిచేస్తుంది. కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అలాంటి కాలేయానికి అనారోగ్యం వస్తే.. అది జీర్ణించుకోలేక మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.

హైపటైటిస్ ఉన్న వారు దూరం: లివర్ సిర్రోసిస్, స్ప్లైనోమెగలీ, హెపటో మెగలీ, హెపటైటీస్ ఉన్న రోగులు కూడా నెయ్యికి దూరంగా ఉండాలి.

గర్భిణీ స్త్రీలు కూడా దూరంగా ఉండాలి: గర్భిణీ స్త్రీ లు కూడా నెయ్యిని తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో వేగంగా బరువు పెరుగుతారు. అలాంటి సమయంలో నెయ్యి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. ఇది స్థూలకాయం సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..