Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Side Effects: టీ తాగేటప్పుడు ఈ పదార్థాలను అస్సలు తినకూడదట.. తింటే ఇక అంతే సంగతులు!!

టీ.. ఇది చాలా మందికి ఒత్తిడిని తగ్గించే రిలాక్స్ డ్రింక్. గృహిణులతో పాటు ఆఫీసుల్లో పని చేసేవారు, బయట ఇతర పనులు చేసుకునేవారు, వ్యవసాయ దారులు, ఆఖరికి కాలేజీ టీనేజర్లు, స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా టీ తాగేస్తున్నారు. ఏంటని అడిగితే.. తలనొప్పి, ఒత్తిడి అంటారు. టీ తాగేటపుడు చాలా మందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. టీ తాగేటపుడు బిస్కెట్లు, బ్రెడ్ లు, పకోడీలు, మిర్చివంటి వేపుడు పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకుంటారు. వేయించిన పదార్థాలను టీ తో కలిపి తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు..

Tea Side Effects: టీ తాగేటప్పుడు ఈ పదార్థాలను అస్సలు తినకూడదట.. తింటే ఇక అంతే సంగతులు!!
Tea
Follow us
Chinni Enni

|

Updated on: Aug 26, 2023 | 7:47 PM

టీ.. ఇది చాలా మందికి ఒత్తిడిని తగ్గించే రిలాక్స్ డ్రింక్. గృహిణులతో పాటు ఆఫీసుల్లో పని చేసేవారు, బయట ఇతర పనులు చేసుకునేవారు, వ్యవసాయ దారులు, ఆఖరికి కాలేజీ టీనేజర్లు, స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా టీ తాగేస్తున్నారు. ఏంటని అడిగితే.. తలనొప్పి, ఒత్తిడి అంటారు. టీ తాగేటపుడు చాలా మందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. టీ తాగేటపుడు బిస్కెట్లు, బ్రెడ్ లు, పకోడీలు, మిర్చివంటి వేపుడు పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకుంటారు. వేయించిన పదార్థాలను టీ తో కలిపి తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియపై ప్రభావం: టీ తో పాటు వేయించిన ఆహారాలను తింటే జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. జీర్ణక్రియలో అసమతుల్యత ఏర్పడి అనేక విధాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. టీ తో సరైన ఫుడ్ కాంబినేషన్ ఏంటో తెలుసుకోకుండా తినకూడదంటున్నారు నిపుణులు.

నిమ్మ రసం జోలికి పోకూడదు: టీ తాగిన వెంటనే నిమ్మరసం, నిమ్మరసం కలిపిన ఆహారాన్ని తినకూడదు. ఇది ఎసిడిటీని పెంచుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ గుండెలో మంటకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

పసుపుతో చేసిన ఆహారాలు తినకూడదు: పసుపుతో చేసిన ఆహారాన్ని కూడా టీ తాగేటపుడు, తాగిన వెంటనే తినరాదు. తింటే.. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, జీర్ణసమస్యలు తలెత్తుతాయి. పసుపు, టీ కలయిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

మలబద్ధకం ఏర్పడుతుంది: వేయించిన ఆహార పదార్థాలు, బిస్కెట్లు, పకోడీలు కూడా టీ తాగుతూ తినకూడదు. అలా తింటే ఆ ఆహారం జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఫలితంగా జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. టీ తాగేటపుడు బిస్కెట్లు తినడం చాలామందికి అలవాటు. కానీ.. అలా తింటే జీర్ణ సమస్యలు, ఆమ్లత్వం, మలబద్ధకం ప్రమాదాలు పెరుగుతాయి.

ఐరన్ ఐటెమ్స్ తినకూడదు: ఐరన్ అధికంగా ఉండే కూరగాయలతో కలిపి టీ తాగరాదు. బచ్చలికూర, వడలు, బ్రోకలీలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. టీ లో టానిన్లు, ఆక్సలేట్ సమ్మేళనాలు ఉంటాయి. గ్రీన్ టీ, ఐరన్ అధికంగా ఉండే కూరగాయలు, ధాన్యాలు, గింజలు వంటి ఆహారాలను టీ తో కలుపరాదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి