Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Tips to Kill Mouse: ఇంట్లో ఎలుకలను చంపేందుకు మందులు వాడకండి.. వీటిని వాడితే అవే వెళ్లిపోతాయ్!!

ఇల్లు ఎంత మోడ్రన్ గా కట్టుకున్నా.. అందులో ఎలుకలు ఉంటే మాత్రం.. వాళ్ల తిప్పలు మామూలుగా ఉండవు. పల్లెటూళ్లలోనే కాదు.. పట్టణాల్లోనూ ఎలుకల బెడద కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఎలుకలను వదిలించుకునేందుకు చాలా మంది ఇళ్లలో ఎలుకల మందు వాడుతారు. కొందరు ఉత్తి పుణ్యానికి వాటిని చంపడం ఎందుకని వదిలేస్తుంటారు. కానీ ఎలుకలు ఒక్కసారి ఇంట్లోకి ప్రవేశించాయంటే.. వాటిని తరమడానికి తల్లో జేజమ్మ దిగిరావాల్సిందే. అయినా అవి పోతాయని..

Home Tips to Kill Mouse: ఇంట్లో ఎలుకలను చంపేందుకు మందులు వాడకండి.. వీటిని వాడితే అవే వెళ్లిపోతాయ్!!
Mouse Catch
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 27, 2023 | 6:30 AM

ఇల్లు ఎంత మోడ్రన్ గా కట్టుకున్నా.. అందులో ఎలుకలు ఉంటే మాత్రం.. వాళ్ల తిప్పలు మామూలుగా ఉండవు. పల్లెటూళ్లలోనే కాదు.. పట్టణాల్లోనూ ఎలుకల బెడద కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఎలుకలను వదిలించుకునేందుకు చాలా మంది ఇళ్లలో ఎలుకల మందు వాడుతారు. కొందరు ఉత్తి పుణ్యానికి వాటిని చంపడం ఎందుకని వదిలేస్తుంటారు. కానీ ఎలుకలు ఒక్కసారి ఇంట్లోకి ప్రవేశించాయంటే.. వాటిని తరమడానికి తల్లో జేజమ్మ దిగిరావాల్సిందే. అయినా అవి పోతాయని గ్యారెంటీ ఉండదు.

ఉల్లిపాయలు, టమాటాలు, ఎండురొయ్యలు వంటి ఆహార పదార్థాలంటే.. వాటికి మహా ప్రాణం. అందుకే ఎలుకలను చంపేందుకు వాటిలోనే మందులు కలిపి పెడుతుంటారు. రాత్రి వేళలో ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నప్పుడు ఎలుకలు ఉంటే.. ప్రశాంతత మాట దేవుడెరుగు.. అవిచేసే మోతకు కనీసం నిద్రకూడా పట్టదు. ఒక్కోసారి ఇల్లంతా తిరిగి మనుషుల కాళ్లను కూడా కొరికేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఆసుపత్రుల్లోనూ ఎలుకల బెడద ఉందని వార్తలు కూడా వచ్చాయి. ఎలుకలను చంపకుండా.. కొన్ని ఇంటి పద్ధతుల ద్వారా వాటిని తరిమికొట్టొచ్చు. అవేంటంటే..

పిప్పరమెంట్ ఆయిల్: ఎలుకలకు పిప్పరమెంట్ వాసన నచ్చదు. అది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ వాసనకు అవి ఇంటి నుంచి వెళ్లిపోతాయ్ పిప్పరమెంట్ ఆయిల్ ను ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే.. అవి ఇంటి నుంచి మాయమవుతాయి. పిప్పరమెంట్ ఆయిల్ ను నీటిలో కలిపి కూడా వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పటిక పొడి: ఎలుకలు పటిక వాసనను కూడా ఇష్టపడవు. పటికను పొడిచేసి ఎలుకలు నివసించే ప్రదేశాల్లో చల్లాలి. లేదా పటిక పొడిని నీటిలో కలిపి ఆ నీటిని.. ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. ఇలా చేస్తే ఎలుకలు ఇంటి నుంచి వెళ్లిపోతాయి.

కారం పొడి: కారం పొడితో కూడా ఎలుకలను ఇంట్లో నుంచి తరిమికొట్టొచ్చు. ఎర్ర కారంపొడి లేదా.. కారం పొడిని కలిపిన నీరును చల్లుకోవచ్చు. కారంపొడిని వాడే ముందు చేతులకు గ్లోవ్స్, కళ్లకు అద్దాలు ధరించండి.

కర్పూరం: మనం పూజకు ఉపయోగించే కర్పూరం కూడా ఎలుకలను దూరం చేస్తుంది. స్టోర్ రూమ్, కిచెన్ ఆ ప్రదేశాలలో కర్పూరం ముక్కలను ఉంచండి. ఆ వాసనకు ఎలుకలు పారిపోతాయి.

పొగాకు: పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటనలు చూస్తూనే ఉంటాం. పొగాకు కూడా ఎలుకలను నిర్మూలించడంలో సహాయపడుతుంది. శనగపిండి లేదా మైదాపిండి కొద్దిగా నెయ్యి కలిపి దానితో మాత్రలు తయారు చేసుకోవాలి. వాటిని ఎలుకలు ఉండే ప్రదేశాల్లో ఉంచితే.. ఇంటిలో ఉన్న ఎలుకలన్నీ బయటకు వస్తాయి.

ఈ టిప్స్ ట్రై చేసి.. మీ ఇంట్లో ఉన్న ఎలుకలను హ్యాపీగా బయటకు పంపండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేవర సినిమాలో చేసిన ఈ నటి.. బయట మాములుగా లేదుగా..
దేవర సినిమాలో చేసిన ఈ నటి.. బయట మాములుగా లేదుగా..
MNC జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్
MNC జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు పండగే..!
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు పండగే..!
దేవీపుత్రుడులో నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
దేవీపుత్రుడులో నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ప్లేవర్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పెస్తుంది
మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ప్లేవర్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పెస్తుంది
నమో భారత్ రైలులో ఉచిత ప్రయాణం.. ప్రయాణికులు చేయాల్సింది ఇదే..!
నమో భారత్ రైలులో ఉచిత ప్రయాణం.. ప్రయాణికులు చేయాల్సింది ఇదే..!
సద్గురు చెప్తున్న డైట్ నెల రోజులు పాటిస్తే ఎన్ని లాభాలో..
సద్గురు చెప్తున్న డైట్ నెల రోజులు పాటిస్తే ఎన్ని లాభాలో..
కొత్త పద్దతుల్లో సైబర్‌ మోసాలు.. బీ కేర్‌ఫుల్‌.. గుర్తించడమెలా?
కొత్త పద్దతుల్లో సైబర్‌ మోసాలు.. బీ కేర్‌ఫుల్‌.. గుర్తించడమెలా?
IND vs ENG: ఇకపై భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య పటౌడీ ట్రోఫీ జరగదు..
IND vs ENG: ఇకపై భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య పటౌడీ ట్రోఫీ జరగదు..
మార్కెట్‌లో ఈ రెండు కార్లకు తిరుగులేదు.. ప్రత్యేకతలు ఏంటంటే..?
మార్కెట్‌లో ఈ రెండు కార్లకు తిరుగులేదు.. ప్రత్యేకతలు ఏంటంటే..?